పుట:Shodashakumaara-charitramu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

39


శివుఁ డైన నప్పురిచెలువలఁ జూచిన
        మరు లొందు భావసంభవునిచేత
శరజన్ముఁ డైన నప్పురికామినులఁ గన్న
        రాగాంధుఁ డగు రతిరాజు చేత
వరదుఁ డైనను నన్నగరకాంతలను గన్న
        మదనాతురుం డగు మదనుచేత
బ్రహ్మచర్యంబులకు నెల్లఁ బాయుదెరువు
వివిధనియమంబులకు నెల్ల వీడుకొల్పు
మహితభోగంబులకు న్మది మందిరంబు
ల................మన్మథోల్లాసపురము.

144


సీ.

హాటకహర్మ్యంబు లంగరేఁకులవారు[1]
        పరిచారికావళి భటచయంబు
స్మరబంధ చిత్రము ల్సకినలమంచము
        ల్చరుపు గీరంబులుఁ బారువంబు
లాలవట్టంబులుఁ గీలుబొమ్మలు మంచి
        పైఁడిపన్నారులు బట్టుతెరలు
నిలువుటద్దములు గంటలయుయాలలు హంస
        తూలికపాన్పులు దోమతెరలు
సారమృగమదకర్పూరచందనములు
లలితచీనాంబరాదులు పొలుపు మిగిలి
చెలువు మీఱ మనోహరశ్రీల మెఱసి
యొప్పుదురు వారకామిను లప్పురమున.

145
  1. యీ పద్యము మూఁడవయాశ్వాసములో నున్నదని - శబ్దరత్నాకరము.