పుట:Shodashakumaara-charitramu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

9


నతివలు శోభనాక్షతలు చల్లగమున్న
        సురపుష్పవర్షము ల్గురియఁదొడఁగె
బ్రాహ్మణాశీర్వాదరావంబునకు మున్న
        యనిమిషకోటి దీవనలు దోఁచెఁ
బొలసి దక్షిణపవనుండు వెలసె దిశల
హవ్యవాహనుఁడు ప్రదక్షిణార్చి యయ్యె
జనవరుఁడు వేడ్క బ్రియ మందె సకలలోక
మోదకర మైన యక్కుమారోదయమున.

30


వ.

అట్టి మహోత్సవమున జనమేజయమహీనాథుండు నానావిధదానఁబులుఁ గామితవస్తుత్యాగంబులు బంధమోక్షణంబులు జపహోమంబులు నొనరించి నముచితపరివారుండై కుమారునకుం గమలాకరుం డనునామం బిడిన మొదలిపక్షంబున విదియచందురుం బోలె ననుదినప్రవర్ధమానుం డగుచు ముద్దుఁబలుకులు పచరించుచుండ.

31


చ.

హృదయము లుబ్బ నొండొరుల కిట్టివిధం బని చెప్పఁబంపుచున్
మృదుమధురంపుటాటలను మేనలరంగను గౌఁగిలించుచు
న్ముదితయు నాథుఁడుం గొడుకుముద్దులఁ దేలనకాని యెన్నఁడు
న్మదిని దలంప రంచితరమావిభవోజ్జ్వలరాజ్యభోగముల్.

32


వ.

ఇట్లతిగౌరవంబునం బెరుపం బెరింగి సముచితసమయసమాచరితచౌలోపనయనుం డై.

33


సీ.

వేదవేదాంగము ల్వివిధపురాణేతి
        హాసము ల్తక్కుధర్మార్థశాస్త్ర