పుట:Saundarya-Lahari.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

సౌందర్యలహరి


నభవతి = కాఁడు (అగును). సతీనామ్ = పతివ్రతలగుయువతులలో, అచరమే = మొదటిదానవగు ఓపార్వతీ, మహాదేవమ్ = ఈశ్వరుని, హిత్వా = విడచి, తవ = నీయొక్క, కుచాభ్యాం = స్తనములచేతనైన, అసఙ్గః = సంపర్కము (కౌఁగిలింత), కురపకతరోరపి = అచేతనమగు గోరింటచెట్టునకును, అసులభః = సులభముకాదు. (స్త్రీలకుచములతోడికౌఁగిలింత గోరింటకు దోహదము).

తా. పార్వతీ, సరస్వతీప్రసాదముగల కవులందఱును సరస్వతీపతులే, కొంచెముధనముగలవాఁ డెల్ల లక్ష్మీపతియే, ఓపతివ్రతాతిలకమా, నీకథమాత్ర మట్లుగాదు. నీకుచసంగ మొకయీశ్వరునకుఁదక్క దోహదమను పేర నచేతనమగు గోరింటాకుఁగూడ దొరకుట యరిది.

గిరామాహుర్దేవీం దృహిణగృహిణీమాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయామ్,
తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి. 97

టీ. హేపరబ్రహ్మమహిషి = పరమాత్మ యగుసదాశివునిరాణి యగుతల్లీ, ఆగమవిదః = వేదములఁదెలిసిన సర్వజ్ఞులు, త్వాం = నిన్ను, దృహిణగృహిణీఁ = బ్రహ్మభార్యయగు, గిరాందేవీం = సరస్వతినిగా, ఆహుః = చెప్పుదురు. త్వామేవ = నిన్నే, హరేః = విష్ణువుయొక్క, పత్నీం = ప్రియురాలగు, పద్మాం = లక్ష్మినిగా, ఆహుః = చెప్పుదురు. త్వామేవ = నిన్నే, హరసహచరీం = రుద్రభార్యయగు, అద్రితనయాం = పార్వతినిగా, ఆహుః = చెప్పుదురు. త్వం = నీవు, తురీయా = ఈమువ్వురు గాక నాలవదానవై, కాపి = చెప్పనలవికానిదానవై, దురధిగమనిస్సీమమహిమా-దురధిగమ = పొందరాని, నిస్సీమ = (దేశకాలవస్తువుల) అవధిలేని, మహిమా = సామర్థ్యముగల, మహామాయా = గొప్పమాయ (మూలప్రకృతి) యై, విశ్వం = సర్వప్రపంచమును, భ్రమయసి = మోహింపఁజేయుచున్నదానవు. సాదాఖ్యచంద్రకళయను పేరుగల శ్రీవిద్యయగునిన్నే పలువురు పలువిధముల నూహసేయుదురు.