ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు.
శ్రీపార్థసారథయేనమః.
సతీమణి
ప్రార్థనాదికములు.
సీ. శ్రీసుదర్శనశోభ * శ్రీసుదర్శనశోభ
నరులపై నతులపై * నెరపువాఁడు
సద్వంశజాతుఁడై * సద్వంశజాతార
వంబున నాసక్తి * వఱలువాఁడు
బక్షపాతములేక * పక్షపాతముచేత
నిక్కి యాడుగరుడి * సెక్కువాఁడుఁ
బుణ్యజనులఁ గ్రాచి • పుణ్యజనులఁ బ్రోచి
యానందమును బొంది • యలరువాఁడు
నైనమౌనిహృదయలోలు • సహితసైన్య
వీక్షణాభీలు విబుధసం * రక్షణాతి
శీలు నార్యసమ్మతసుగు * ణాలవాలుఁ
గొలుతు నిహతారిజాలు నా * గోపబాలు. 1
- సీ. శ్రీదేవి నెదఁ గొల్చి * శేషశేషాశనా
శీవిషాశనులను * జిత్తమందుఁ