పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శశికళ

52

అక్కసురాలు


ఒక్కణ్ణై ఎక్కణ్ణో
సుక్కి పోయి సోలి యుంటి

                మక్కువ ఇంతైనలేని అక్కసురాలా !
                టక్కులాడి వై పోతివె

                          చక్కని దానా !

నా పూజలు మోసమంట
నా ప్రార్ధన వ్యర్ధమంట

                నన్నొక పెరవాని చేసి
                అన్నెకారి మాటలంటి వక్కసురాలా !
                టక్కులాడి వై పోతివె చక్కనిదానా !

                          ఒక్కణ్ణై ఎక్కణ్ణో
                          సుక్కి పోయి సోలి యుంటి !
                          మక్కువ ఇంతైనలేదె అక్కసురాలా !