ఈ పుట ఆమోదించబడ్డది
శశికళ
10
కాదంబినీ వక్ష నట శంపవో
ప్రాదంబరేంద్ర కార్ముక వర్ణవో ?
అరుణాంశు చుంబితా
నందరాజీవ హృదయ
కేసరపరాగ గాం
గేయ ప్రకాశవో !
ఓ చెలీ నీవెవరు
ఓ చెలీ నీవెవరు ?
కలలో నణీయవా ?
కతలోని ప్రణయవా ?
దివిజ గంగా తరంగ స్వరమవో
హిమజ యమునా గమన గానమ్మవో!
గోదావరీ సప్త
కూలం కషానుగత
తాపస పవిత్రపద
తాళ స్వరూపవో !
ఓ చెలీ నీవెవరు
ఓ చెలీ నీవెవరు ?