పుట:SakalathatvaDharpanamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్దశసంఖ్యా ప్రకరణము.

1. చతుర్దశ కరణములు.

శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము, వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్త, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ14న్ను చతుర్దశ కరణము లనంబడును.

2. చతుర్దశాధి దేవతలు.

దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు, వహ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యువు, చతురాననుడు, చంద్రుడు, బ్రహ్మ, జీవుడు, శివుడు యీ14న్ను చతుర్దశానుదేవత లనంబడుదురు.

3. చతుర్దశ కర్మములు.

శబ్దము వినుట, శీతాదుల యెరుంగుట, చూచుట, రుచిగొనుట, ఆఘ్రాణించుట, పలుకుట, పనులుజేయుట, నడుచుట, మలమూత్రవిసర్జనంబొనరించుట, ఆనందించుట, చలించుట, నిశ్చయించుట, చింతించుట, అభిమానపడుట యీ14న్ను చతుర్దశకర్మ లనంబడును.

4. చతుర్దశ మహావిద్యలు.