పుట:Sakalaneetisammatamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంతులవారు దేశమాతృసేవయు భాషాసేవయునే జన్మజీవితఫలముగాఁ బని సేయువారు గావున నీగ్రంథప్రాచుర్యమునకు మమ్ముఁ ప్రేరేపించి తగినసహాయసంపత్తిని గలిగించినందున దీని నిప్పటికిఁ బ్రకటింపఁగలిగితిమి. ఇందు యథాశక్తి సవరించియు నింకను దోషసహస్రములు గలవు. ప్రాచీనగ్రంథపరిశోధనసంస్కారగ్రంథ మించుక పడసియు ననేకప్రఘట్టముల లేఖకదోషములఁ దృప్తిగా సవరింపఁజాలక యున్నదియున్నట్టుగా ముద్రించితిమి. ఎట్లో నూతనకవిత చెప్పుట సులభము కాని వరకవిహృదయము గుర్తించి శాస్త్రవిషయమున నతనిపలుకుల నూహించి తెచ్చుట దుర్ఘట మనుట విజ్ఞు లెఱింగిన విషయమేకదా! ఆదర్శాంతరము లఖించునేని భాషకుఁ బరమోపకార మగు నని యెల్లరును యథాశక్తి గ్రంథాన్వేషణము సేయుదురని ప్రార్థనముతో విరమించుచున్నారము.

చెన్నపురి,

మా - రామకృష్ణకవి

1923