పుట:Sakalaneetisammatamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తనతోఁబుట్టుచేఁ జచ్చినట్టును వైరూప్యునకు మాఱు వైరంత్యుఁ డనియు నున్నది. మూలమున—

దేవీగృహం గతో భ్రాతా భద్రసేన మమారయత్
మాతుః శయ్యాంతరాలీనః కారూశం చౌరసః సుతః
లాజాన్ విషేణ సంయోజ్య మధునేతి విలోభ్య తమ్
దేవీ కు కాశిరాజేంద్రం నిజఘావ రహోగతమ్
విషదిగ్ధేన సౌవీరం మేఖలామణినా నృపమ్
నూపురేణ చ వైరూప్యం జారూష్యం దర్పణేన చ.

అని వైరూప్యమునకు మాఱు వైరంత్యమనియు కొన్ని ప్రతులఁ బాఠము గలదు. కౌటిలీయమున "దేవీగృహే లీనో హి భ్రాతా భద్రసేనం జఘాన। మాతు శయ్యాంతర్గతశ్చ పుత్రః కారూశమ్। లాజా న్మధునేతి విషేణ పర్యస్య దేవీ కాశిరాజమ్। విషదిగ్ధేన నూపురేణ వైరంత్యం। మేఖలామణినా సౌవీరం, జాలూధమాదర్శేన వేణ్యాగూఢం శస్త్రం కృత్వాదేవీ విదూరథం జఘాన॥” అని యున్నది. బాణుని హర్షచరితమున స్త్రీలయందు నమ్మిక దోషజనకం బని "స్త్రీ విశ్వాసిన శ్చ మహాదేవీగృహగూఢభిత్తిభాగ్భ్రాతా భద్రసేనస్యాభవన్మృత్యవే కాళింగస్య వీరసేనః మాతృశయనీయతూలికాతలనిషణ్ణశ్చ తనయో౽ న్యం తనయమభిషేక్తుకామస్య దధ్రస్య కరూశాధిపతే రభవన్మృత్యవే। మధుమోదితం మధురక సంలిప్తైర్లాజైః సుప్రభా పుత్రరాజ్యార్థం మహాసేనం కాశిరాజం జఘాన। వ్యాజజనితకందర్పదర్పా చ దర్పణేన క్షురధారాపర్యంతే నాయోధ్యాధిపతిం పరంతపం రత్నవతీ జారూథమ్। యోగపరాగవిషవర్షిణా చ మణినూపురేణ వల్లభా సపత్నీరుషా వైరంత్యం రంతిదేవమ్। వేణీనిగూఢే స శస్త్రేణ బిందుమతీ వృష్ణిం విదూరథమ్। రసదిగ్ధ మధ్యేన చ మేఖలామణినా హంసవతీ సౌవీరం వీరసేనమ్॥" అని పలుకారణంబుల మగలఁ జంపిన వీరస్త్రీలప్రశంస చేయఁబడియె. ఇంకను శోధింపఁ గళింగరా జగు భద్రసేనుఁడు మహాదేవీగృహమున లోగోడలో దాఁచుకొని యున్న తనయన్నచేతనే చచ్చెనఁట. కాశిరాజగు మహాసేనునిభార్య సుప్రభ తనకొడుకునకు రాజ్య మిప్పించఁగోరి మగనిఁ జంపించెనఁట. సుప్రభకంటెఁ గైకేయి ఋజుహృదయగదా! రత్నవతి మదవిభ్రమవిషంబున నయోధ్యాపతి యగు పరంతపు (నన్యస్త్రీసక్తు) మదనలీలావిలాసముతో నద్దము విసరివైచి చంపెనఁట! సవతిసౌభాగ్యము నోర్వజాలక సునందన వైరంత్యనగ