పుట:Sakalaneetisammatamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విగ్రహయానాసనసమాశ్రయ ద్వైధిభావంబు లను రాజషాడ్గుణ్యంబులును, మంత్రిరక్షణకార్యాకార్యవిధంబును, మిత్రామిత్రవివేకంబును, నుపాయవికల్పంబును, దండయాత్రావిధంబును, జతురంగబలప్రకారంబును, బ్రయాణప్రయత్నంబును, దత్తచ్ఛకుననిశ్చయంబును, యుద్ధదానవివరణంబును, నీతిస్కంధమూలప్రకారంబును, బ్రత్యర్థిరాజబలాబలచింతనంబును, నుభయబలవ్యూహారచనచాతుర్యంబును, గరికోట చతురంగాయోధననిశ్చయంబును, గార్యత్వరితక్రమంబును, అధికాధముల సయోధ్యావిధంబును, జోరనీతిప్రకారంబును, నవిశ్వాసపరిశీలనప్రకారంబు నన్నది తృతీయాశ్వాసము.