పుట:Sakalaneetisammatamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ఖలుసంగతి గూడిన ని
ర్మలచిత్తుండైనఁ జేయుఁ బ్రతికూలుండై
యలనూనియ కర్పూరము
గలసిన విషమైనయట్లు కందామాత్యా. 989

నీతితారావళి



క. వడిదునిమివైవఁ దన కగ
పడునంతకు శత్రునెడ గపటభక్తి దగున్
కడుగదె నదీప్రవాహము
వడిద్రిప్పగ వలసి యంఘ్రిపముపాదంబుల్. 990

అజ్ఞాతము

ఆశ్వాసాంతము

క. పంచేషుజనకరిపుగజ
పంచాననపాంచజన్యభాసితహస్తా
పంచానన నారీముఖ
సంచితవాగ్విజితపాదసరసిజయుగళా. 991

క. మురళీఘననాదామృత
తరళీకృత యోగిహృదయతామరస మహత్
ఖురళీమల్లవిమర్దన
విరళీకృతజననమరణ విశ్వాతీతా. 992

మాలిని. స్ఫురదురుశుభకీర్తి! భూరి విజ్ఞానమూర్తీ!
గురుతరగుణశీలా! గోపికాచిత్తలోలా!
సరసిజదళనేత్ర! సత్యభామాకళత్రా!
విరళితభవపాశా! విశ్వలోకప్రకాశా. 993

గద్యము ఇది శ్రీ సరసింహవరప్రసాదలబ్ధకవితావిచిత్ర భారద్వాజగోత్ర పవిత్రాయ్యలామాత్య పుత్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతంబైన సకలనీతిసమ్మతం బను రాజనీతిశాస్త్రంబందు రాజుల కవశ్యకర్తవ్యంబగు సంధి