పుట:Raadhika Santhvanamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామా యట్లనె కాని, మంచిపని మేలాయెన్ మఁఱే మాయె నా
భామారత్నము దాను గూడి సుఖమై వర్ధిల్లినం జాలదే. 34

సీ. మఱచెనో నా చేత మణితోక్తు లన్నియుఁ
బలుక నేర్చిన నాఁటి పంజరింపు
ఎంచఁడో నా చేత నెలజంత్రగాతంబు
లభ్యసించిన నాఁటి యనుసరింపు
తలఁపఁడో నా చేతఁ దగు దేసి గుజరాతి
విత మెఱింగిన నాఁటి వేఁడికోళ్లు
వీడెనో నా చేత వెడవిల్తుశాస్త్రంబు
దెలియఁ బూనిన నాటి తెఱవుమఱువు
గీ. గణన సేయఁడొ మరుసాముగవనములను
దాను నా చేతఁ బడిన బెత్తంపుఁబెట్లు
బరులు గని గేరి నవ్వ దబ్బఱ మురారి
మాయలకె పొంగె సత్యభామా లతాంగి. 35

గీ. నిన్నఁగుప్పయు నేఁ డాళ్లు; నెలఁత తాను
కోరి నా మీదనే సేసె కారుబారు[1]
ముక్కుపచ్చలు మానక మునుపె బిరుదు
[2]పెచ్చుకొలతోడఁ గొట్లాడ వచ్చినట్లు. 36

  1. కారుబారు = వ్యవహారము, తొందర, ఇబ్బంది — బ్రౌణ్యమిశ్రభాషానిఘంటు
    ప్రయోగాంతరము: ‘కారుబారు సేయువారు గలరే? నీవలె సాకేతనగరిని’ – త్యాగరాజు
  2. పిచ్చికల - అని తా. ప. ప్ర.