పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1948కి ముందు తెలంగాణ

హైద్రాబాద్‌ సంస్థానాన్ని పాలించిన రాజవంశాలలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, వెన్గాండ వంశీయులు, కందూరు చోడులు, కాకతీయవంశస్టులు, ముసునూరి వంశస్థులు, రేచర్ల పద్మనాయకులను ప్రధానవరుసలో మనం చెప్పుకోవచ్చు. ఇట్ల ఈ వరుసలో పాలించిన చివరి రాజవంశం అసఫ్‌జాహీలడే.

అయితే బహమనీ సుల్తాన్‌ల కాలం నుంచే దక్కన్‌లో ముల్కీ ఉద్యమాలు నడిచినయ్‌. 18వ శతాబ్దంలో ఇరాన్‌, ఇరాక్‌, టర్కి అరేబియా దేశాల నుంచి అనేకులు దక్కన్‌ ప్రాంతంలో స్థిరపడ్డరు. వీళ్ళనే అఫాకీలు (స్థానికేతరులు) అన్నరు. దక్కనీలు ముల్మీలు, అఫాకీలు గైర్‌ ముల్మీలుగ కాలం గడిపిండ్రు. అయితే వీళ్ళ నడుమ మతపరమైన అంశం చోటు చేసుకుంది. అఫాకీలు షియాలని, దక్కనీలంత సున్నీలనే బేధ భావం తారాస్థాయికి చేరింది. దీంతో అనేక ఘర్షణలు చెలరేగి 1521లో బహమనీ రాజ్యం అంతరించింది.


అంబటి వెంకన్న * 9