పుట:PandugaluParamardhalu.djvu/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అప్పుడు గద్ద ఒకటి వచ్చి వాలి ఆమె చేతిలో ఉన్న ప్రసాదపు ముద్దను తన్నుకు పోయింది. అందుతో కైకేయి నేల మీద పది ఏడవడానకి ఆరంభించింది. రాజు ఈ సంగతి తెలుసుకున్నాదు. కాని ఏమి చేయడానికి అతనికి పాలు పోలేదు.

    అప్పుడు కౌసల్య, సుమిత్ర తమ ముద్దలలో చెరి ఒక సగమూ కైకేయికి ఇచ్చారు.
  కేసరి అని వానర ప్రభువు, అతని భార్య అంజన, ఆమె రిరకాలంగా ఋష్యమూక పర్వతం మీద తపస్సు చేస్తూ బలశాలిఐన పుత్రుణ్ణి ప్రసాదింపమని శంకరుని ప్రార్ధస్తూ ఉంది.
    తుదకు శంకరుడు ప్రత్యక్షమైన ద్వాదశరుద్రులలోనూ పదకొండో వాడైన మహారుద్రుని అంశతో ఒక కుమారుడు పుడతాడనీ - కళ్లు మూసుకుని అంజలిబద్ధయై ప్రార్ధిస్తూ ఉండవలసిందనీ  - ఆమె దోసిలిలో ప్రసాదం పడుతుందనీ - దానిని తినవలసిందనీ ఉపదేశించాడు.
    ఆమె అట్లే చేసింది.  కైకేయి చేతులనుండి తన్నుకు వచ్చిన ప్రసాదాన్ని గద్ద దైవవ?శాన్ని అంజనాదేవి అంజలిలో పడవేసింది.  ఫలితంగా యుక్తకాలంలో హనుమంతుడు పుట్టాడు.
  గద్ద నోటినుంది ప్రసాదం వాయువు తోడ్పాటు వల్లనే అంజనాదేవి అంజలిలో పడింది కాబట్టి ఆ ప్రసాద ప్రభావం వల్ల పుట్టిన ఆంజనేయునికి వాయు నందనుడు అనే పేరు కూడా వచ్చింది.
  ఈ గద్ద పూర్వజన్మంలో సువర్చల అనే పేరు గల అప్సరస.  బ్రహ్మశాపాన్ని పొంది ఆమె గద్ద అయింది.  అంజనాదేవిని అంజలిలో నిస్వార్ధబుద్ధితో ప్రసాదాన్ని ఉంచడంతో గద్ద రూపంలో ఉన్న ఆమెకు శాపమోక్షం అయింది.
                        ఆదర్శ పురుషుడు
      పుట్టుక ఎట్టిదైనా హనుమంతుడు ఆదర్శపురుషుల్లో ఒకడు.  అతడు ఆరాధనీయుడు.  రామాయణంలో అతని అద్భుత పాత్ర అందరూ ఎఱిగిందే.  రామాయణంలోని ఆరుకాండల్లోనూ చివరి మూడు కాండల్లోని కధ అంతా హనుమంతుడి మీదుగానే నదచిందంటే అతిశయోక్తి ఏమిన్నీ కాదు. అతడు బాల్యంలో తీవ్రాంశుని వేడికోర్చి అతని వద్ద వేలాది విద్యలు