పుట:PandugaluParamardhalu.djvu/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆమె ఒకానొక పర్వమున స్నానం చేసి ఉపవాసం ఉండి సవిత్రీదేవికి ప్రీతిగా అగ్నిహొత్రమునందు హోమం చేసింది. బ్రాహ్మణులచేత స్వస్తి వచనం చేయించింది. పూజాశేషపుష్పములను తీసికొనివెళ్లి తండ్రికి నివేదించింది. అప్పుడు తండ్ర్ ఆమెతో 'బిడ్డా నీకు వివాహోచిత కాలం వచ్చింది. ఇంతవరకు నిన్ను ఎవరూ వరించలేదు. నీవైన అనురూపగుణుణ్ణి వరించి నాకు తెలుపుము. యుక్తాయుక్తాలు విచారించి నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తాను ' అన్నాడు.

    అప్పుడు ఆమె కొందఱు పద్దలు వెంటరాఘా రధమెక్కి వరాన్వేషణార్ధం బయలుదేసి వెళ్లింది.  దగ్గర అరణ్యంలో చదువు కొని వయోరూపవిద్యాగుణ సంపన్నుడు, ద్యుమత్సేను పుత్రుడు అగు సత్యవంతుని వరించింది.  వచ్చి ఆ విషయం తండ్రికి చెప్పింది.  అయితే ధ్యుమత్సేనుడు ప్రస్తుతం తనసాళ్వ పొగొట్టుకుని అంధుడై అరణ్యంలో ఉంటున్నాడు.  ఇంతేకాక అప్పుడు అక్కడికి వచ్చిన నారదుడు సత్యవంతుడు నాటికి యేడాదినాదు మరణించునని చెప్పాడు. దానిమీద అశ్వపతి సావిత్రితో మరి ఒకని వరించమంటాడు.  ఏమైనా సరే సావిత్రి త్గన మనస్సు మార్చుకోదు.  అప్పుడు సావిత్రి సత్యవంతుల వివాహం జరిగిపోతుంది.  సావిత్రి కాపురానికి వెళుతుంది.
    అత్తింట సావిత్రి పతి ఆయు:ప్రమాణాన్ని ఒక్కొక్క దినంగా లెక్కించు కుంటూ ఇక నాలుగుదినాలు గడువు అని గణించుకుని ఆమె త్రిరాత్రోవవాస వ్రతాన్ని పూనింది.  నాల్గవనాడు ఉదయమున అగ్నిహోత్రానహోమాలు చేసింది. సూర్యాస్తమయానంతరం పారణ సమయంగా నిర్దేశించుకొన్నది.
   ఇంతలో ఫలనమిత్కుశలకు సత్యవంతుడు అడవికి ప్రయాణమయ్యాడు. అతనితో సావిత్రిన్నీ వెళ్ళింది.  అడవిలో అతడు గొడ్డలితో సమిధలు కూరుస్తూ తలనొప్పిగా ఉన్నదని సావిత్రి తొడమీద తలపెట్టుకుని పడుకున్నాడు.  ఇంతలో సత్యవంతుడు ప్రాణములు తీసికొని వెళ్లుటకు యముడు వచ్చాడు.
   మగనితల నేలమెద ఉంచి సావిత్రి లేచి నిలుచుండి అతనికి నమస్కరించి మీరెవరని ప్రశ్నిస్తుంది.  తానుయముడననీ, సత్యవంతుని ప్రాణాలు కొనిపొవడానికి వచ్చాననీ చెప్పాడు.  సత్యవంతుని ప్రాణాలు తీసికొని పోతూ ఉంటాడు. నియతవ్రత సిద్ధ అయిన సావిత్రి అతని