పుట:PandugaluParamardhalu.djvu/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విమర్శ

     సావిత్రి పతిభక్తి నిరూఅమానమైంది.  పతిభక్తే కాదు. ఆమె తెలివి తేటలు, ధైర్యసాహసాలు కూడా విరుపమానమైనవే.
   మూడు రోజుల ఉపవాసం - గింజలూ, పళ్లూ వాయనం ఇవ్వడము ఇవి సావిత్రి పతిమరణ కాలంలో చేసిన వ్రత చిహ్నాలు కావచ్చు.
  కన్యలకు స్వయంగా వరుల్ని సంపాదించుకునే హక్కుగల కాలంనాటికి చెందిన కధ ఇది.
   ఆత్మకూడ కనిపించే వస్తువు అనే నమ్మకం ఈ కధలో ద్యోతకమౌతూ వుంది.
                                                    -  Daughter's of Malwa.
   వట మూలం బ్రహ్మ - మధ్య జనార్ధనుడు- చివర శివుడు = సమగ్రంగా సావిత్రి.
     నియమితరీతి ఒక సంవత్సరం ఏక భుక్తం. జ్యేష్ఠజ్యేష్ఠశుద్ధ త్రయోదశి మొదలు జ్యేష్ఠకృష్ణపాడ్యమి వరకు.  నాలుగో రోజున చంద్రుడికి అర్హ్యదానం, సావిత్రికి గంధపుష్పాదులతో పూజ. అనంతరము పూజ. ఏకభుక్త నియమం పెట్టుకునే వారికి ప్రతిదినం వటవృక్ష పూజా నియమం. నాలుగురోజులు మాత్రం పూజ చేసేవారు పాడ్యమినాడు బ్రాహ్మణులకు దానం చేయాలి.
   ఈ వ్రతం రాజస్థానంలో సామాన్య ప్రచారం కలది.  మహారాష్ట్ర దేశంలో కొంతకలదు.  దక్షినాస్మార్తుల్లో మాత్రమే కలదు.  బ్రాహ్మణులే కాక శూద్రులు కూడా ఈ వ్రతం చేయడం కద్దు.  వంగదేశంలో ఈనాదు స్త్రీలు వట వృక్ష, సావిత్రి పూజలు చేయడం కద్దు.  వంగదేశంలో ఈనాడు స్త్రీలు వట వృక్ష, సావిత్రి పూజలు చేయక భర్తల పూజ చేస్తారు.  భర్తలకు తలంటి పోసి కొత్తబట్టలు కట్టిస్తారు.  భర్తపూజ ఐనతరువాత యమపూజ చేస్తారు. వ్రతానికి పేరు మాత్రం వట సావిత్రే అంటారు.  విచరిని వటవృక్షశాఖలకు పూజ. పల్లెటూళ్లలో మాత్రం పూజ వటవృక్షాల కింద సాగుతుంఇద్.  ఇది కౌటింబిక వ్రతం.   -వ్రతోత్సవ చంద్రిక
     ఈ సావిత్రి కధ ఆంధ్రదేశంలో కొంచెం తేడాగా ఉంటుంది. వినతగింది.
   మద్రదేశమునకు రాజు అశ్వపతి. అతని భార్య మాళవి,  ఆ దంపతులు పద్దేనిమిది సంవత్సరాలు సావిత్రిదేవిని గుఱించి తపస్సు చేసి ఒక కూరుతును పోందారు.  సావిత్రీదేవి వరాన పుట్టడం చేత ఆమెకు సావిత్రి అని పేరు పెట్టారు.  ఏక పుత్రిక కాబట్టి ఆమెను ఎంతో గారాబంగా పెంచారు.  ఆమె వరయోగ్య అయింది.  ఆమె దివ్య తేజస్సుకు వెఱచి ఎవరున్నూ ఆమెను వరింపలేదు.