పుట:PandugaluParamardhalu.djvu/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూర్తిగా నిరాహారంగా వుండలేనివారు నీళ్లు పాలు, తేనీరు, పళ్లు సింగార (water plant) సగ్గుబియ్యము, పంచదార పుచ్చుకోవచ్చును.

      కుంకుమతో కలిపిన బియ్యం (అక్షతలు), పసుపు, కర్పూరం, పువ్వులు, అత్గరొత్తులు, దారం, ఒకకర్రను చుట్తిన కొన్నివత్తులు, ఆకులు, పొకలు చిల్లర డబ్బులు- ఇవి పూజకు ముఖ్యంగా కావలచినవి.
     పూర్ణీమనాటి ఉదయాన్ని స్త్రీలు వటవృక్షానికి పూజ చేస్తారు.  ఈ చేట్లు కావడానికి మూడుసారులు దారం చుడతారు.  అప్పుడు పూజ చేసి నైవేడ్యం పెడతారు.  ఆ మీద స్త్రీలు బియ్యము కాని గోధుమలు కాని ఒకరికి ఒకరు వాయనం ఇచ్చుకుంటారు.  ఆ వాయనంలో మామిడి పళ్లు కూడావుంచుతారు.
    పూర్ణిమనాటి మధ్యాహ్నం పురోహితుడు వచ్చి సావిత్రి కధ చెబుతాడు.  పురోహితుడు చెబితే తప్ప చెప్పుకుంటే ఈ కధకు ఫలం లేదని మాళవదేశస్ధుల నమ్మిక.
                           కధ
   మనదేశంలో వాడుకలో వున్న సావిత్రి కధకున్నూ కాళవదేశంలో వాడుకలో వున్న సావిత్రి కధకూన్ను కొద్ది తేడాలు వున్నాయి. తేడాలు వున్న స్థలాలు పేర్కొంటాను.
    నారదుడు వచ్చి ఆ రాజకుమారుని అల్పాయుష్షుని గురించి చెబుతారు.  ఐనా ఆమె తన సంకల్పాన్ని వీడలేదు.  అప్పుడు నారదుడు ఆమె భర్త మరణ సమయంలో చేయవలసిన వ్రతాన్ని గురించి ఆమెకు ఉపదేశం చేసి వెళ్లిపోతాడు.
    నారదుడు చెప్పిన దినం వచ్చింది.  ఆనాడు సావిత్రి తన భర్తతో కూడా అడవికి వెళ్లింది.  వటవృక్షాన్ని ఎక్కి ఎందుకొమ్మకొట్టబోయాడు. ఇంతలో ఆ కొమ్మ విరిగి అతడు కిందపడి మరణించాడు.
    యముడు మూడో వరం కోరుకోమంటాడు.  సావిత్రై తనకు అనమందుగురు కొడుకుల్ని ఇమ్మని అడుగుతుంది.  అడావుడిలో యముడు ఇచ్చానంటాడు.  ముందుకు పోతాడు.  సావిత్రి అప్పుడు తనకు భర్తలేకుండా పిల్లలు ఎలా పుడతారంటుందు.  ఇక చేసేదిలేక యముడు ఆమె భర్త ఆత్మను ఆమెకు ఇచ్చివేస్తాడు.