పుట:PandugaluParamardhalu.djvu/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇట్లు రాజులను అందరినీ చంపి వేయడం చేత భూమి అంతా పరశురామునిదే అయిపోయింది. అప్పుడు పరశురాముడు యజ్ఞము చేసి ఆ భూమి అంతా కశ్యపాది బ్రాహ్మణులకు దానం చేసివేశాడు. ఆ పిమ్మట అతడు మహేంద్రగిరి మీద తపస్సు చ్వేసికొనుటకు ఆశ్రమం నిర్మించుకొన్నాడు. నీవు దాన మిచ్చిన నేల మీద నీవు ఇక నివసించకూడదని బ్రాహ్మణులు అన్నారు., అప్పుడు పరశురాముడు పడమటి సముద్ర తెరానికి వెళ్లి తన స్రువమును సముద్రంలోనికి విసిరాడు. అది రెండు యోజనాల దూరాన పడింది. ఆ ప్రదేశాన్నుండి సముద్రుడు ఉపసంహరించుకున్నాడు. ఆ కొత్తగా ఏర్పడిన ప్రదేశం పరశురాముడు తనకు నివాసంగా చేసుకున్నాడు. అదే మలబారుదేశం.

    ఈగాధను పురస్కరించుకుని వ్రతోత్సవం చంద్రికాకారుడు, దక్షిణ భారతదేశంలో మలబారు వారది పరశురామశకం, పరశురాముడు ఉన్నచోట కరువు ఉండదంటారు.  కాబట్టే మలబారులో ఎప్పుడూ కరువు ఉండదు.
    మహేంద్రగిరి అనునది ఆంధ్రోత్కళ దేశాల సరిహద్దున ఒరిస్సా నుండి ఖాండవము (నేటి గోండ్వానా) వరకు వ్యాపించిన పర్వతము ఇది కుల పర్వతాలలో ఒకటి.  మహేంద్రగిరి నుంచి తరలి పోయి అతడు మలబారులో వలస నెలకొన్నాడు.
     పరశురాముని చేతలను శ్రీప్రతాపరెడ్డి ఇట్లు పరిమర్శించుదున్నాడు.
    "పరశురాముడు ఒక విధముగా గొప్ప సంస్కర్త అతడు అనులోమ సంజాతుడు.  అతడు క్షత్రియ స్త్రీయగు రేణుకకును, బ్రాహ్మణుడగు జమదగ్నికిని బుట్టిన వాడగుటచే నేటి ఆచారమును బట్టి సంకరజాతిలో చేరవలసినవాడు.  కాని పూర్వకాల మందుండిన మర్యాదల వలన జమదగ్నియొక్క యుత్పత్తి అనులోమ పద్దతిచే సశాస్త్రీయమే.
      పరశురాముని కాలమందు క్షత్రియులకును బ్రాహ్మణులకును జాత్యున్నతి విషయమై కలహములు జరుగుచుండెనని చరిత్రక్జారుల యబిప్రాయము.  ఉత్ప్కష్ఠతకై పెనగుచుండిన బ్రాహ్మణ క్షత్రియ వివదమును పరశురాముడు గొడ్డలితో తీర్చెను.  ఇతని క్షత్రియ సంహారము నేటి వరకును చాలజాతులకు అనుకూలమగు నాచారముగా నేర్పడియున్నది.  పెతిహీనులైన క్షత్రియ స్త్రీలనుండి మిశ్రజాతులేర్పడినట్లు ఎందరో ప్రమాణములను కల్పించుకొనినారు.