పుట:PandugaluParamardhalu.djvu/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తీర్ద యాత్రలన్నీ చేసి పరశురాముడు తిరిగి తపం ప్రారంభించాడు.

    ఆసమ్నయంలో  ఇంద్రాది దేవతలకు రాక్షస బాధ ఎక్కువ కాగా వారు శివుని శరణుచొచ్చారు  అపుడు శివుడు రాముని రప్పించి పరశువు అనే గొడ్డలి ఆయుధాన్ని ఇచ్చి దేవతలల మీదికి పంపాడు. అప్పటి నుంచి అతడు పరశురాముడు అయ్యాడు.  పరశురాముడు వెళ్లి స్వర్గలోకంలో రాక్షసులు లేకుండా చేశాడు.
  ఆ పిమ్నట అతడు తల్లిదండ్రులను చూడ్డానికి వచ్చాడు.  ఒకనాడు రేణుక నీళ్లు తేవడానికి వెళ్లింది.  అక్కడ చిత్రరధుడనే గంధర్వరాజు కుమారుడు తన భార్యతో జలవిహారం చేస్తూఉన్నాడు.  తన కట్టి అదృష్టం లేకపోయింది కదా అని రేణుక చింతించింది.  ఈ చింతనంతో ఆమె ఆశ్వమానికి ఆలస్యంగా వెళ్లింది.  ఆలస్యానికి కారణం ముని తెలుసుకున్నాడు.  కళింకిత అయిన ఆమెను ఖండించవలసిందిగా జమదగ్ని కొడుకులను కోరాడు.  మొదటి ముగ్గురు కొడుకులు ఆపని చేయడానికి ఒప్పుకోలేదు.  నాలుగో కొడుకైన పరశురాముడు వెంటనే ఆమెను ఖండించాడు.  అందుకు మెచ్చి తండ్రి కొడుకును ఏదైనా వరం కోరుకోమన్నాడు.  అప్పుడు అతడు తంకు మాతృభిక్షేపెట్టమని కోరాడు.  అందుఈద జమదగ్ని రేణుకను పునర్జీవితను చేశాడు.
    తన ఆయుధమైన గండ్రగొడ్డలితో అతడు చేసిన ఘనకార్యాలు ఇట్టివి.  నాడు తండ్రి ఆశ్రమంలో లేడు.  తల్లి దు:ఖిస్తూతమ హోమదేనువును 'సురభి ' ని కార్తవీర్యుడు అనే రాజు బలవంతంగా తోలుక పొయాడని చెప్పింది.  రాముడు గండ్రగొడ్డలి భుజాన వేసుకును పోయి ఆరాజును చంపి గోవును తిరిగి తీసుకువచ్చెను.
     ఇందుకు పగబట్టి కార్తవీర్యుని కొడుకులె పరశురామముడు  ఇంటలేని సమయంలో వచ్చి జమదగ్నిని చంపి వేశాడు.  రాముడు తిరిగి వచ్చేసరికి తల్లి తండ్రి శవం వీద పడి ఏదుస్తూ ఉంది.  కొడుకుని చూచి ఆమె ఇరవిఓక్కసారులు గుండెలు బాదుకుని ఏడ్చింది.  అప్పుడు పరశురాముడు ముయ్యేడు మారులు రాజుల మీద దండెత్తి గర్బాలలొ నున్న పిండాలను కూడా చంపివేశాడు.  తానుచంపిన రాజుల నెత్తుటితో పితరులకు తర్పణం చేశాడు.  ఆనెత్తురు శమంతపంచకం అనే పేరుతో అయిదు మడుగులు అయింది.