పుట:PadabhamdhaParijathamu.djvu/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉరి____ఉరి 221 ఉరి____ఉరు

  • "విలసిల్లు నురిగోల వేదన బొందు పులుగు చందంబున బొరలుచుండితిమి." ద్విప. జగ. 210.

ఉరితీయు

  • ఉరివేసి చంపవలె నని శిక్షవేయు.
  • చూ. ఉరివేయు.

ఉరి పెట్టుకొ మ్మను

  • నిరసనగా 'ఏమైనా చేసుకొమ్మను' అనుపట్ల అనేమాట. కొత్త. 13.

ఉరిపోసికొన్నట్లు

  • ఎక్కువ యిబ్బందిగా.
  • "నీతో ఉరిపోసికొన్న ట్లుంది." వా.

ఉరిపోసుకొను

  • చూ. ఉరివోసుకొను.

ఉరియాడు

  • డోలాందోళిత మగు.
  • "మనం బురియాడన్." రుక్మాం. 4. 134.

ఉరివేయు

  • కొఱతవేయు.
  • చూ. ఉరితీయు.

ఉరివోసుకొను

  • 1. మెడకు త్రాడువంటి దానిని తగిలించుకొని ఆత్మహత్య చేసికొను.
  • 2. ఉరి పోసుకొన్నంత భాధపడు.
  • "ఆ అమ్మాయి ఉరిపోసుకొని చనిపోయిం దట." వా.
  • "వాడితో ఉరిపోసుకొన్నట్లుగా ఉంది." వా.

ఉరిసినపుండు కోల కెలకు

  • బాధ పడుచున్న వానిని మఱింత బాధ పెట్టు. శకుం. 3. 171.

ఉరిసినపుండుపై ఉప్పు చల్లు

  • అసలే బాధ పడుతుండగా మరింతబాధ కలిగించు. గోరుచుట్టుపై రోకటిపోటు వంటిది.
  • "ఉరిసన పుండుపై నుప్పును జల్లి, కెరల జేసెదవు..." గౌర. హరి. ద్వి. 1255-1256.
  • రూ. ఉరిసినపుండ్ల ఉప్పుపెట్టు.
  • "అరులు మనమీద నురవడి నరుగుదేర నేము సిడిముడి పడుచుండ నిట్టు లనుట, యొప్ప దురసినపుండుల నుప్పు వెట్టె, దరయ దీనికి నిన్ను నే మందు బార్థ." భార. ద్రో. 5. 358.

ఉరుమనిపిడుగు లగు

  • వజ్రప్రాయము లగు.
  • "ఉరుమని పిడుగు లై యొడలు చిల్లులు వోవ, బడుమరుకోలల." రాధి. 2. 21.

ఉరురతి

  • రతిలో ఒక భేదము. కుమా. 9. 152.

ఉరువులు

  • వస్తువులు, శాల్తీలు.
  • "మొత్తం ఉరువులు చిన్నవీ పెద్దవీ కలిసి ఇరవైనాలుగు. సరిగ్గా ఉన్నాయో లేవో చూచుకోండి." వా.