పుట:Navanadhacharitra.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

నవనాథచరిత్ర

[1]యలలకునున్ వెల ◆ యాండ్లకు మదిని
కలకాలములును నె ◆ క్కడివి నిల్కడలు
పతిలేని యెడ నొంటి ◆ పడి [2]పూవుఁబోణు
లతనుచిత్తంబున ◆ నలయు చున్నెడకుఁ
జక్కనివారికిఁ ◆ జనుటుచితంబె
మొక్కలింపకుము తెం ◆ పుకుఁ బనిలేదు
బాగెఱుంగక వేగ ◆ పడఁబనిలేదు
బాగెఱింగిన వానిఁ ◆ బాయు నాపదలు
ఊరక చొరఁబాఱ ◆ కూహించు కొనుము
పారువ వలతొ నీ ◆ ప్రాణంబు వలతొ
యేకాంతమున నున్న ◆ యెడ మగవారి
నాకాంత మదిఁ గోరు ◆ ననయంబు వదలి
యెవ్వని [3]కడఁకైన ◆ నేగెడుబాణ
మెవ్వని ధృతిఁగాడు ◆ నెదురుతాఁకై న
నొరపుగావలరాయఁ ◆ డొడ్డినయురులు
ఎలమితో మించుల ◆ యింతి వాగురులు
పొలుచు మన్మథుని తీ ◆ పుల వింటిబొమలు
నెలఁతల జిగిమించు ◆ నెలవంకతూపు
ననవిల్తు వాఁడిబా ◆ ణంబుల మొనలు
వనరుహాక్షుల నిడు ◆ వాలుగన్గొనలు
కాయజుసతి చేతి ◆ గజనిమ్మపండ్లు
తోయజాక్షులమించు ◆ తొలుకుపాలిండ్లు
పలుకులు బొంకులు ◆ పసలు వేసాలు
వలపులు వెడవెడ ◆ వావులు నున్న
మదిరాక్షులకు మది ◆ మాటలట్లుండె
విదితంబుగానింక ◆ విను మొక్కమాట
కన్నులపండువు ◆ గా నిందుముఖులు
చెన్నొంద నిన్నువీ ◆ క్షించిన పిదప
నల నలునై న జ ◆ యంతుని నైన
నలకూబరునినైన ◆ ననవిల్తునైన
చీరికిఁగొన రన్న ◆ చిత్రాంగి నొకతె

  1. లలనలకును మగవాండ్లకు మదను
  2. రతింబొణు లతనుచితంబు వలయుచున్నడకు
  3. కడకునె నెఱుంగుదు