పుట:Navanadhacharitra.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

నవనాథచరిత్ర

డైన నాగార్జునుఁ ◆ డను సద్గురుండు
నా మీఁదఁ గృపఁజేసి ◆ నాకు నాత్రేయ
నామం బొనర్చి నా ◆ నా యోగ మతము
లెఱిఁగించి మరి సిద్ధ ◆ హేమవాదంబు
[1]నెఱిఁగించి నాకది ◆ యిడెఁ జలం బూని
పసిఁడికై విరసించి ◆ బంధువులైన
నసువులు గొనఁ జూతు ◆ రన్యాయమునను
ధనలోభనిరతులై ◆ తఱినేఁచు దుష్ట
మనుజుల [2]నృపులను ◆ మరి యాడఁగాదు
బలిమియుఁ దేజంబుఁ ◆ బాడియు మిగులఁ
గలనృపుఁ డొక్కఁడు ◆ గావలెఁ గల్మి
ననుచు విచారించి ◆ నట్టి మా కడకుఁ
జన నరోత్తమ నీవె ◆ చనుదెంచి తింక
నెవ్వరి వెతకఁబో ◆ నేటికి నీకుఁ
ద్రవ్వితండంబుగా ◆ ధనము నే నిత్తుఁ
జాలువుగా వాజి ◆ సామజభటుల
నేలి మారక్షణ ◆ మేమరకుండు
మనుటయు వినతుఁడై ◆ యమ్మహీనాథుఁ
డనియె నాతనికి మ ◆ హాత్మ నాపుణ్య
ఫలమున నీపాద ◆ పద్మముల్ గంటిఁ
దలఁప నస్థిరమైన ◆ ధారుణీరాజ్య
మల్పసుఖాపేక్షినై ◆ యుండఁ జేసి
కల్పాంతమున నర ◆ కంబున నెరియఁ
జాల నీచే యోగ ◆ సంగతిఁ గనుట
మేలుకార్యం బిట ◆ మీఁద నాకనిన
నీ నృపాలుఁడు రాజ్య ◆ హీనుఁడై తాప
మూని యిట్లాడుచు ◆ నున్నాఁడు సొలసి
ఘనమైన యితని దుః ◆ ఖము మాన్పవలయు
నని విచారించి నా ◆ గార్జునుఁ డనియె
నీలాగు వెడ బుద్ధు ◆ లేల భూపాల
యేలింతు నీచేత ◆ నెలమిని నేల
న్యా శిష్యుఁడవు నీవు ◆ నా గార్జునుండు

  1. నెఱింగింపనది యిడెంజాముబూని.
  2. నృపులకు మరియాదగాదు.