పుట:Navanadhacharitra.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

నవనాథచరిత్ర

నాతనితోడ నా ◆ గార్జున శిష్యుఁ
డాతత మధుర వా ◆ క్యముల నిట్లనియెఁ
బటుదంత హయవీర ◆ భటతతి నేలి
నటువంటి మహిమ నీ ◆ యందుఁ దోఁచెడిని
యెటనుండి వచ్చితి ◆ వెందుల కేఁగె
దిటు వివర్ణ తఁ బొంద ◆ నేల నీ కనిన
నా మహీపాలుఁ డి ◆ ట్లనె సిద్ధవర్య
నామీఁద నహితమా ◆ నవనాథుఁ డొకఁడు
చెలరేఁగి పూని వ ◆ చ్చినవాని తోడఁ
దలపడి యుద్ధతిఁ ◆ దక్కిమై నొక్కి
మదనారణముల సా ◆ మ్రాణి తేజులను
దుదిలేని ధనములఁ ◆ దొడవుల డించి
చెదరిన గతి గట్టు ◆ చెట్టునుం జేరి
యదవద నొంది యే ◆ యాసయు లేక
మది [1]గొల్ది దిరుగుచు ◆ మహినెల్లవారుఁ
బదివేల ముఖములఁ ◆ బ్రస్తుతి సేయ
నీవెంపు విని వేడ్క ◆ నీపాదసేవ
తేపగా శోకాబ్ధి ◆ తీరంబు చేరఁ
గాంతు నేనని వచ్చి ◆ కనుఁగొంటి నిన్ను
నింతలో నా పాప ◆ మెల్లను బాసె
దయమీఱ ననుఁ జూచి ◆ [2]దండితారాతిఁ
జేయు మద్రాజ్యంబు ◆ సమ్మతి నొసఁగు
మనుచుఁ జేతులు మోడ్చి ◆ యలికంబుఁ జేర్చి
వినతుఁడై యున్న య ◆ వ్విభు నాదరించి
యా సిద్ధ పుంగవుం ◆ డనియె నో రాజ
నీ సంపదలు నీవు ◆ నీ మహీతలము
నీ వారణంబులు ◆ నీ వాహనములు
వేవేగ మరల ర ◆ ప్పించి నీ కొసఁగ
రాకేమి మదిలోన ◆ రాజుల నమ్మి
[3]పోకుంట మహిలోన ◆ బుద్ధి యూహింప
మును జామదగ్ని స ◆ న్ముని శేఖరుండు
ఘనపదార్థములు ది ◆ గ్గన సమకూర్చి

  1. దర్పితారాతి.
  2. గొంద్ది.
  3. పోకుండ్డ మదిలోన బుద్ధినూహించి.