పుట:Narayana Rao Novel.djvu/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అ ఇ ఉ ణ్ ఋ ఌ క్

195


శారద నాతడు దగ్గరకుజేరిచి యామెచుట్టు చేయివైచి, యామె మోము పైకెత్తి తమితో ముద్దుగొనబోవుచుండ, కేశవచంద్రరావు గబగబ నచ్చటికి, బరువెత్తి వచ్చి ‘చిన్నక్కా, నాన్నగారు నీకోసం చూస్తున్నారు’ అన్నాడు.

కేశవచంద్రరావు మాట వినబడుటతోడనే శారదా జగన్మోహను లిరువురు నులికిపడినారు. జగన్మోహనుడు తన చేయి శారదచుట్టునుండి తీసివేసి, దూరమునకు జరిగినాడు. శారదయు గబుక్కునలేచి, త్వరితముగ లోనికి వెడలిపోయినది.

జగన్మోహను డచ్చటనే యొంటరియై కూర్చుండెను. అబ్బా! యీ పిశాచిబాలకుడు సమయానికి దాపరించుచున్నాడు. తాను జమీందారుబిడ్డ యయ్యు వీనికి నా వెధవపల్లెటూరి మొద్దంటే ఇంత ప్రేమ యేమిటి? ఆ తండ్రిపోలిక తగలబడింది కాబోలు. ‘నిమిషంలో జారిపోయినది. ఇంకొక చిటికలో నామెను ముద్దుగొనియుండువాడే. ఎప్పటికైనా తనదే శారద!’

శారద లోనికి బోవునప్పటికి జమీందారుగా రొక పడుకకుర్చీపై నధివసించి యేవేని వార్తాపత్రికల జదువుకొనుచు, శారద వచ్చుట జూచి, యామెను దగ్గరకు లాగికొని ‘ఎక్కడకు వెళ్ళావమ్మా’ యని ప్రశ్నించెను.

‘తోటలోనికి నాన్నగారూ.’

‘జగన్మోహనుడు నిన్ను కొట్టబోయాడు అని తమ్ముడు చెప్పాడేమిటమ్మా?’

కేశవచంద్రుడు తండ్రికడకుబోయి తండ్రిగారి చేతిమీద రెండుచేతులు వైచి తండ్రి మొగముచూచి, ‘ఆ! బావ శారదను దగ్గిరగా తీసికొని కొట్టబోయాడు. అది కిటికీలోంచి చూచాను. రంగమ్మను కనుక్కోండి నాన్నగారూ!’ జేవురించిన మోముతో పలికినాడు.

జమీందారుగారు కుమారునెత్తి యొడిలో కూర్చుండబెట్టుకొని, కౌగిలించుకొని, క్రిందికి దింపివేసెను.

‘అమ్మాయీ! జగన్మోహనరావు తోటలో నున్నాడా!’ యని యడిగెను.

‘అవును నాన్నగారూ. నేనూ బావా తోటలోకి వెళ్ళాం. అదిచూచి బాబు బావ నన్ను కొట్తున్నాడు అనుకున్నాడు కాబోలు.’

‘అదేలే! లేకపోతే ఏమిటి కాని, నువ్వు లోనికివెళ్లు తల్లీ! బాబూ నువ్వు బువ్వతిన్నావా? నిన్ను ఎవరూ పడుకోబెట్టలేదూ? తల్లీ, బాబుకు నువ్వు జగన్మోహనునితో మాట్లాడటమే ఇష్టంలేదు.’

శారద మరల వచ్చునేమో యని జగన్మోహను డచ్చటనే కూర్చుండి యుండెను. ఎంతకును నామె రాకుండుటయు, భోజనమువేళదనుక నచ్చటనే