పుట:NagaraSarwaswam.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

1. వ్యాఘ్రస్కందబంధము : ఈ బంధము వ్యానతకరణములలో చేరినదైనను ఆలుమగలు శయ్యను విడువనక్కరలేదు. వనిత శయ్యపై వెలికిలగా శయనించి యున్నదై తన పార్ష్ని భాగములను (తొడలయొక్క ప్రక్కభాగములు, చట్టలు) చేతులతో గ్రహించి తన జఘనభాగమును (మొలయొక్క ముందుభాగమును, యోనిద్వారదేశమును) బాగుగా వెల్లడియగునట్లు చేయగా - పురుషుడామెను తొడలను ఆమె ముఖము మీదుగా బాగుగావంచి రమించుటకు వ్యాఘ్రస్కంద మనిపేరు. దీనియందు - స్త్రీకి క్లేశము ఎక్కువ. అయినను అభ్యాసముచే సుసాధ్యం అవుతుంది. పులుల రమణ మిట్లుండుటచే దీనికీ పేరు వచ్చినది.

ఇట్టివైన ఈ ఐదు కరణములయందు మొదటిదైన ఉత్తానకరణమునందే స్త్రీకి ఆనందము ఎక్కువ. ఎందువల్లననగా ఉత్తానకరణమునందు పురుషాంగముచే యోనియు పురుషుని చేతులచే స్తనాదులు కూడ ఒకేసమయమున మర్ధింపబడతాయి. అంతేకాక దీనియందు స్త్రీకి క్లేశముకూడ తక్కువ. నీచరతులయందు సర్వదా ఉత్తానకరణమే ఆచరింపదగినది.

ఇక రెండవదైన తిర్యక్కరణమునందు భార్య ప్రక్కవాటుగా శయనించి ఉంటుంdi. అందుచే ఆమెయొక్క పిరుదుల బరువుచే యోని ముఖమునందొక బిగువేర్పడి, ఆ స్థితియందు భర్త కలియగా అతని పురుషాంగము యోని పార్శ్వములను మిక్కిలిగా ఒరుసుకొనుటచే ఏదో తెలియని వింత ఆనందము కలుగుతుంది. స్త్రీ యోని కంటె పురుషాంగము పెద్దదైన ఉచ్ఛరతుల యందిది మిక్కిలి సుఖాన్ని అందిస్తుంది.

మూడావదైన ఆసీనకరణమునందు ఆలుమగలు కూర్చుండి రమించుట జరుగును. గనుక - ఒకరికొకరు కౌగలించుకొనుటకు