పుట:Naa Kalam - Naa Galam.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, జై ఆంధ్ర ఉద్యమం మాత్రం ఎంతకాలం వుంటుంది? ఉద్యమం చప్పబడ్డం ప్రారంభించగానే మంత్రివర్గ పునరుద్ధరణ ఆలోచనలు ప్రారంభమైనాయి. ముఖ్యమంత్రి ఎవరు? తిరిగి పి.వి. నరసింహారావునే ప్రతిష్ఠిస్తే, ఆంధ్ర ప్రాంతీయులు అంగీకరించరు; ఆంధ్ర ప్రాంతీయులనే నియమిస్తే, తెలంగాణా వారు ఒప్పకోరు.

ముఖ్యమంత్రిత్వానికి అయిదారు పేర్లు నలగడం ప్రారంభించాయి. ముఖ్యమంత్రి కావడనికి ఆయా అభ్యర్ధులకు అనుకూల, ప్రతికూల అంశా లున్నాయి.

నేను ఇదంతా చూచి, ప్రధాని ఇందిరా గాంధికి సుదీర్ఘమైన లేఖ రాశాను. ముఖ్య మంత్రిత్వాన్ని కోరుతున్నట్టుగా పత్రికలలో పేర్లు వినవస్తున్న వారిని గురించి, వారి అనుకూల, ప్రతికూల అంశాలను వివరిస్తూ, చివరికి రెండు ప్రాంతాలకు ఆమోద యోగ్యుడు శ్రీ జలగం వెంగళరావు అని తేల్చాను!

ఎందువల్లనంటే, ఆయన ఆంధ్రప్రాంతంలో జన్మించి, తెలంగాణా ప్రాంతంలో స్థిరపడి, అక్కడి వారి చేత "మావాడే" అనిపించుకుంటున్నాడు. పైగా, తెలంగాణాలోని ఖమ్మంజిల్లా పరిషత్తు చైర్మన్‌గా ఎన్నికై, ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. తెలంగాణా నుంచే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక అవుతున్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో హోమ్‌మంత్రిగా తీవ్రవాదులను అణచి వేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పారు. ఆయన ముఖ్యమంత్రిత్వానికి ఉభయ ప్రాంతాలవారు అంగీకరిస్తారని స్పష్టీకరించాను.

నా లేఖను ప్రధాని ఇందిరా గాంధి చూచి ఊరుకోలేదు. అప్పటిలో రాష్ట్రపతి పరిపాలన అమలులో ఉంది కాబట్టి, నా లేఖను అప్పటి గవర్నర్‌ సలహాదారు శ్రీ హెచ్‌.సి. సరీన్‌కు పంపి, ఆ లేఖలో పేర్కొన్న రాజకీయ నాయకులను గురించి మరింత వివరంగా నా అభిప్రాయాలను తెలుసు