పుట:Maharshula-Charitralu.firstpart.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

128

మహర్షుల చరిత్రలు


వానిని ద్యజించి శుద్దాత్ముఁడై పరమాత్మునిలో నైక్యమైపోవును. ఆట్టి యోగికి గౌరవము విషము. అవమానమే యమృత మగును. ఆయోగి తన కున్నదే " యిల్లుగాఁ దన యాఁకలికి దొరకినదియే భోజ్యముగాఁ దనకు గలదియే ధనముగా ముదమంది మమకారము నందఁడు. కావున, నీవు విచారము దక్కి, యట్టి యోగపురుషుఁడవై మోక్షవృత్తి మఱవకు" మని యలర్కునకు బోధించెను. అలర్కుఁడు బ్రహ్మానందముతో గృహమునకేఁగి రాజ్యమును బ్రీతిపూర్వకముగాఁ గాశీరాజున కిచ్చెను. దానిని గాశీరాజలర్కుని యన్న కీయఁబోయెను. అలర్కుని యన్నయు నానందించి తాను సోదరునకు జ్ఞా ప్రబోధము చేయుటకే రాజ్య మర్థించితి ననియు నాపని యగుటచేఁ దనకు రాజ్య మక్కఱలేదని కాశీరాజునకుఁ దత్త్వ ముపదేశించి తన యాశ్రమమునకుఁ బోయెను. కాశీరాజు అలర్కునిఁ బూజించి రాజ్య మాతనికేవిడిచి చనియెను. అలర్కుఁడు సుతునకుఁ బట్టము కట్టి యడవి కేఁగి యోగియై విరాగియై యాత్మసుఖము నందెను.

దత్తాత్రేయమహర్షి సంగమును విడనాడుటకై వివిధవేషములఁ గైకొనువాఁడు. విల్లునమ్ములు కొని వేఁటకుక్కలు వెంట రాఁగాఁ జెంచు వానివలె నుండువాఁడు. కాఱడవిలోఁ గిరాతతతి యుండెడుచో నుండి మద్యమాంసములు సేవించువాఁడు. మాలపల్లికేఁగి చండాలురతోఁ గూడి మద్యమును గ్రోలువాఁడు. ఉన్నత్తుఁడై నట్లు విహరించువాఁడు. ఐన నాతఁడు మహాయోగీశ్వరేశ్వరుఁడు. విచిత్రచరిత్రుఁడు.

"శ్లో॥ విభుర్నిత్యానంద శ్శ్రుతిగణశిరోవేద్యమహిమా
       యతో జన్మాద్యస్య ప్రభవతి వ మాయాగుణవతః, |
       సదాధార స్సత్యో జయతి పురషార్థైక ఫలదః
       సదా దత్తాత్రేయో విహరతి ముదా జ్ఞావలహరిః" ||