పుట:Maharshula-Charitralu.firstpart.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దత్తాత్రేయ మహర్షి

127


అలర్కుఁడు సమ్యగాత్మదర్శనుఁడై దత్తాత్రేయునకు వందనము లాచరించి "నీకృపచే బ్రతికితిని. సుస్థిరజ్ఞాన ముపదేశింపు" మని వేఁడుకొనెను. దత్తాత్రేయుఁడు “మమ యనుట దుఃఖమునకు, నమమ యనుట నిర్వృతికిని మార్గము. అహంకారమను నంకురముచేఁ బుట్టి మమకార మను మొదలు కలిగి గృహము క్షేత్రము నను కొమ్మల నంది పుత్త్రులు భార్య యను పల్లవముల నొప్పి ధనము ధాన్యము నను పెద్ద యాకులు వేసి పుణ్యపాపములను పుష్పములఁ బూచి సుఖదుఃఖములను పండ్లు కాచి చిరకాలము పెరిగి యజ్ఞాన మను కుదుళ్ళతో నిండి ముక్తిమార్గమును గప్పివేసియున్న మమ యను వృక్షమునీడను సంసార పథపరిశ్రాంతు లగు మిథ్యాజ్ఞాన సుఖాధీనులకుఁ బరమ సుఖము పరమ దుర్లభము కావున, నీ మహావృక్షమును విమల విద్యయను గొడ్డలిఁ దీసికొని తత్త్వనిధులు సాధుజనులు వీరితోడిసంగ మసు పాషాణమున బాగుగా మాఱి పదనుపెట్టి యెవరు నఱకుదురో వారు చల్లని బ్రహ్మవనము చొచ్చి నిత్యానందులై యపునరావృత్తి నుందు రని యుపదేశింపఁగా విని యానందియై "మహాత్మా ! నిర్గుణ బ్రహ్మైకత్వమును బోధించు యోగము నెఱిఁగింపు" మని వేఁడుకొనెను. అంత నాతఁడు “వత్సా ! శరీరమునందలి పరమజ్ఞానమునకు గురుఁడే యుపద్రష్ట. మోక్షార్ధికి యోగము జ్ఞానపూర్వకమగును. ప్రకృతి గుణములతో నేకత్వము లేకపోవుటయు బ్రహ్మైకత్వము కలుగుటయు ముక్తి యన నొప్పును. ఆముక్తి పరమయోగమునఁ గలుగును. యోగము సంగత్యాగము వలన సిద్దించును. సంగత్యాగము వలన నిర్మమత్వము దాని వలన వైరాగ్యము దానివలన జ్ఞానము దానివలన మోక్షమును సంభవించును. ?

యోగికి ముం దాత్మజయము కావలెను. కనుకఁ బ్రాణాయామముచే నాతఁడాత్మదేహదోషము దహింపఁ జేయవలెను. ---జములైన కర్మములు యోగవిఘ్న కార్యములగుట యోగి