పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదమూఁడవ ప్రకరణము.

57


కాని ఆయన నాయార్పులు పెడచెవిని పెట్టి నిన్న సాయంకాలము వారిని క్రైస్తవమతమునందు కలుపుకొనెను.” ఇదివిని నేను చాలకోపమును దుఃఖమును చెందితిని. “ఘోషాస్త్రీలను సహితము క్రైస్తవులను చేయుచున్నారుగా ! భేష్ ! నేను దీనికి ప్రతివిధానము నాలోచించెదనుగాక,” అనుచు లేచితిని. వెంటనే అక్షయ కుమారదత్తు కలము కదలించితిని. “తత్వబోధినీ” పత్రికలో నొకరోషపూరితమగు వ్యాసము వెలువడెను. “ఘోషా స్త్రీలుసహితము స్వధర్మమునుండి భ్రష్ఠులై పరధర్మము నవలంబించుచున్నారు. ఇట్టి ఘోరమునన్నిటిని ప్రత్యక్షముగా చూచుచుకూడ మనమింకను చైతన్యులము "కావలదా ! ఇంకను ఎంత కాలము మనమిట్లుఅనుత్సాహముతో జడులమై పడియుండుట? ధర్మమంతయు నాశనమ గుచున్నది. ఈ దేశము విచ్ఛిన్న మగుటకు పక్రక మించినది. మన హైందవ నామమే తుడిచి పెట్టుకొని పోవుదశ సంభవించుచున్నది. .............. కావున మీరును మీకుటుంబములును మంగళముగ నుండదలచేదరేని, మీ దేశము యొక్క ఔన్నత్యమును ప్రతిక్షించెద రేని, సత్యమునందు మీరు ప్రీతిగలిగియుందురేని, క్రైస్తవమత ప్రచారకుల సాంగత్యము నుండి పబాలురను దూరముగ నుంచుడు. మీపుత్రులను వారిపాఠ శాలలకు పంపుటమానుడు. తగినంత త్వరలో వారి మనసులను వికసిం ప జేయుటకు శీఘ్రముగా యత్నములు సలుపుడు. బీదబాలుర విద్యా భ్యాసమునకు “మిషన్ ' పాఠశాలలలో తప్ప అన్యస్థాన మెక్కడ అం దురేమో? అట్లనుటకు సిగ్గుపడవలదా ! తమధర్మమును ప్రచారము చేయుటకు క్రైస్తవులు భీకరసాగర తరంగములను ధిక్కరించి భారత దేశముమధ్య ప్రవేశించి ప్రతినగరము నందును, ప్రతి పల్లె యందును పాఠశాలలు స్థాపించుచున్నారు. మనమన్ననో,బీద బాలురకు విద్యగరపు నిమిత్తము ఒక్క పాఠశాల నైనను స్థాపింపమైతిమి. మనమందరమును