పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునోకండవ ప్రకరణము.

51


చుందురు. ఎక్కడ చూచినను 'దేవమందిరము లన్నియు దేవావిర్భావముతో నిండి యుండును, భక్తియుచ్ఛ్వాసముతో ఉచ్ఛాసిత మగుచుండును. మంగళ ధ్వనులతో నినాదితమగుచుండును. కాని నాకుమాత్ర మదంతయు శూన్యముగనుండెను. ఎప్పుడు నేను నాఉపాస్యదేవతను దర్శించి ఆయన సమ్ముఖమునందుదునో, ఎప్పుడు ఆయనకు నాహృదయము యొక్క భక్తి ఉపహారము నిచ్చి ఆయనను పూజింతునో, ఎప్పుడాయన మహిమను కీర్తింతునోయని, జలాభావమువల్ల కలుగు పిపాసవలె బలవత్తరమైన యీకోరిక నాకు కఠిన దుఃఖముని చ్చెను. ఇప్పుడు నాకావాంఛ పూర్ణ మయ్యెను.దుఃఖమంతయు దూరమయ్యెను.


పరమేశ్వరు డెప్పుడును ఆయన భక్తులను పరిత్యజింపడు.ఎంత కాలమైన పిమ్మట, కరుణామయుని యీకరుణ కనుగొంటిని!ఎవరు అతనిని కోరుదురో వారతనిని పొందుదురు. నేనీ ప్రపంచమున దీనదరిద్ర భాగ్యహీనునివలె తిరుగుచుండువాడను. ఇది ఆయన ఇంక చూడ జాలడు. అతడు నాసమ్ముఖమున ప్రకాశితుడయ్యెను. నేను చూచితిని. "ఆయవకాస్మిన్నమాకాశీ తేజోమయోహమృతమయః పురుషః సర్వానుభూః, ” ఈసర్వజ్ఞ,"తేజోమయ, అమృతముయ పురుషుడు, ఈ ఆకాశము నందున్నాడు. ఈజగన్మందిరమునందు జగన్నాధుని దర్శించితిని. అతని నేవ్వరును 'ఇక్కడ' అని నిరూపింపనేరరు, ఎవ్వరును అతనిని హస్తములతో నిర్మాణము చేయజాలరు.అతడు తనంత తానే నిత్యస్థితి ఎందుచున్నాడు. ప్రాణదాతయగు నాయుపాస్య దేవతను నేను పొందితిని. నిర్జనమునందును, సజనము నందును, అతని నుపాసించి పవిత్రుడ నైతిని. ఏయాశతో నతని చెంత చేరితినో ఆయాశతీరెను. ఇంత పొందితిని చాలని నేను సంతుష్టిచెందితిని. కాని " ఇంత కొంచమేగదా యిచ్చితిన " ని అతనికి