పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

మహర్షి దేవేంద్రనాధకాకూర్ స్వీయచరిత్రము,

158

సుతా తే” పఠింపనారంభించెను. వారితో మామత సిద్ధాంతములు చాల వరకు కలసెను. మార్గ మధ్యమున ఇటువంటి మనుజుడుండుట చూచి ఆశ్చర్యపోతిని. నేనతనిని పడవకు రమ్మని పిలచి కొనివచ్చితిని. అతడు వచ్చి నాతోనే భుజిం చెను. అతనికి కొంచము 'కారణ్' * [1]మాత్రమిచ్చితిని. అది తాగుచు నతడు, “అలినాబిందుమా త్రేణ త్రికోటికులముద్ధ రేత్ ”... ఒక్క సారాయి చుక్క తాగినవాడు మూడుకోట్ల మంది పూర్వుల నుద్ధరించున”ని చెప్పసాగెను. " నేను శివసాధనచేసితిని” అని అతడు చెప్పెను. అతడు 'ఘోర తాంత్రికుడు. అతడు రాత్రి పడవలో నావద్ద నే పరుండి, తెల్ల వారుజామున లేచి ఏమేమో వల్లింపనారంభించెను. ఉదయముననే యమునానదిలో స్నానము చేసి వెడలి పోయెను.


నేను తర్వాత బృందావనమును చేరి తిని, లాలా బాబు ఔదార్యము వల్ల కట్టబడిన సుప్రసిద్ధ గోవిందజీ మందిరమును చూడ బోతిని.నాట్య మందిరమున నలుగురైదుగురు కూర్చుండి శితార్ వాద్యమునువినుచుండిరి. నేను గోవిందుజీకి ప్రణామము చేయకుండుట చూచి వారు నిర్ఘాంతపోయిరి.

ఆగా విడచిన మాసమునకు, పుష్య బహుళ ద్వాదశినాడు,పడవ ఢిల్లీ చే రెను. ముందొక పెద్ద గుంపును చూచితిని, ఢిల్లీ పాదుషా యచట గాలిపటము లెగరవేయుచుండెను. అతనికిప్పుడు చేతిలో వేరేపని లేదు. ఇంకేమి చేయును? ఢిల్లీ నగరము ప్రవేశించి బజారులో నొక యిల్లు అద్దెకు తీసికొంటిని. నన్నింటికి తిరిగి తీసికొనిపోవుటకు నాగేంద్రనాధు డచ్చోటికి వచ్చియుం డెను. ఢిల్లీ నగర రాజవీధినున్న బజారు వద్ద నేనుంటిని. కాని నన్నతడు వెదకి వెదకి కనుగొనజాలక నిరాశ చెంది ఇంటికి మరలిపోయెను. ఈ సంగతి నాకు తర్వాత తెలిసెను.


  • సోమరసముయొక్క. తాంత్రిక - నామము