పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది నాల్గవ ప్రకరణము.

127



మునందున్నావో అట్లే తేజము నందున్నావు. నీవు వాయువు నందున్నావు. శూన్యమునందున్నావు. నీవు వేఘముల యందునున్నావు. నీవు పుష్పముల యందునున్నావు. నీవు సౌరభము నందునున్నావు, హే జగదీశ్వరా! నీవు సమ్యగ్రూపముగా సర్వత ప్రకాశించుచున్నావు. నీవు నీ సకల కార్యములందును దీప్యమానుడవగుచున్నావు. కాని దోషియు నవివేకియునగు మనుజుకు నిన్నొక్కమారైనను స్మరణ చేయడు. సకల విశ్వమును నిన్నే వ్యాఖ్యానించు చున్నది. నీ పవిత్ర నామమును ఉచ్ఛై స్వరము , " పునఃపునః ధ్వనితము చేయుచున్నది. కాని విశ్వనిస్సృత ఏతద్రూప మహా నాదము యెడలకూడ మేము బధిరులమై యున్నాము. మా అచేతన స్వభావ మీ ప్రకారముగ నున్నది. నీవు మాకు చతుర్దశ లయందునున్నావు, నీవు మాఅంతరమునందున్నావు. కాని మేము మాఅంతరమునుండి దూరముగ బ్రమణము చేయుచున్నాము. స్వీయాత్మలనే మేము దర్శించుట లేదు. మరియు వానిలో నీయనుష్టానము ననుభవించుట లేదు. 'హే పరమాత్మా! హేజ్యోతి : అనంత సౌందర్య రాశీ హేపురాణ, అనాది, అనంత! సర్వజీవులకు జీవనమా ! ఎవ్వరు తమ అంతరమునందు నిన్ను అనుసంధానము గావింతురో వారు నిన్ను దర్శనము చేయునిమిత్తము గావించు ప్రయత్నము లెన్నడును విఫలములు కావు. కాని అయ్యో! నిన్ను అనుసంధానము కావించువా రేరి? ఏ సకలవస్తువులు నీవు మాకు ప్రదానము గావించితివో అవి ప్రదాత యొక్కహస్తమును స్మరణకు రానివ్వనంతగా మామనస్సుల నాకృష్టము గావించియున్నవి. విషయ భోగముల నుండి విరక్తులమై క్షణకాలము నిన్ను ధ్యానించుట కైనను తగు నవకాశము మామనస్సులు పొందుట లేదు. మాజీవితము కొరకు నీమీద నాధార పడియు నీన్ను విస్మృతి చెంది జీవనయాపనము చేయుచున్నాము. 'హే ! జగదీశా! నీజ్ఞానా భావముతో జీవిత మెందుకు, జగత్తెందుకు? ఈ సుసొరములో నుండు సకల నిరర్ధ