పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

మహర్షి దేవేంద్ర నాధఠాకూర్ స్వీయచరిత్రము.

ఇరువదియాకటవ ప్రకరణము


1848వ సంవత్సర ఆశ్వయుజ మాసము నందీరోజులలోనే కొందరు స్నేహితులను వెంట బెట్టుకొని దామోదర నదిమీద విహారార్థమై బయలు వెడలితిని. వారము దినములు దాని వంపులన్నిటిమీదను తిరిగి పిమ్మట ఒక సాయంకాలము నాలుగు గంటలకు మాపడవ నొక ఇసుక తిప్పవద్ద కట్టి పెట్టితిమి. వర్థమాన్ (Burdwan) అచ్చటికి సమీపములోనే నాలుగు మైళ్ళలో నున్నట్లు తెలిసినది. దానిని చూడవలెనని నాకు వెంటనే కుతూహలము జనించెను. నేను తక్షణమే నౌకదిగి యిసుకలో రెండు కోసులు కాళ్ళు ఈడ్చుకొనుచు బర్ద్వానుకు పోతిని. రాజనారాయణ బోసు, మరియొక రిద్దరు కూడ నాతో నుండిరి.మేము పట్టణ సమీపమును చేరు సరికి ప్రతిగృహము నందును దుకాణ మునందును దీపములు వెలిగించిరి. మేము ఇటునటు తిరిగి, పట్టణము, బజారు, కొవ్వువత్తి దీపములు పెట్టబడియున్న ఒక గదిలో రాజుగారు కూర్చుండి యున్నట్లు నాకు బయట నుండి కన్నించెను. మాకుతూహలము పూర్ణమైన పిమ్మట ఆ యిసుక తిప్పలోనుండి మాపడవవద్దకు తిరిగి వచ్చితిమి. అప్పటికి రాత్రి చాల పొద్దు పోయెను. బహుశః రాజనారాయణ బాబిదివరకెన్నడు సంతదూరము నడచియుండ లేదేమో. మాతో నడువ లేక పోయెను. బహు ప్రయాసమిూదట పడవచేసి అందు పరుండెను,పిమ్మట జ్వరము తగిలెను.


నేను మరునాడు తెల్లవారుజామున తరుణ సూర్యరశ్మిచే ప్రశాశించుచున్న ఆదామోదర నదీ పుణ్య స్రౌతమునందు స్నానమాచరించి నీలవర్ణపు పట్టు బట్టలను ధరించి, నియమిత ఉపాసన గావించు రాజమందిరము చూచితిమి.