పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియవ ప్రకరణము,

101




వీటినన్నిటిని గణించియు ఏకక్షణమున తలపోయ లేము. ఒకప్పుడతడు మన అంతరమునందున్నట్లు తలంచు చుందుము. ఒకప్పుడాతడు బాహ్యమునందున్నట్లు తలపోయుదుము. మరియొకప్పుడతని యందే నివసించునట్లు భావించు చుందుము. కాని ఒకే సమయమునందా యవాత ప్రాణిక నిత్య జాగ్రత పురుషుడు తనలోతాను శాంత భావముతో అవస్థితుడై తన ముగళ యిచ్ఛ నిత్యము నెఱుంగుచున్నాడు. మన అంతరమున జ్ఞానధర్మ ప్రేరణ గావించు చున్నాడు. మరియు బాహ్యజగత్తునందు జీవుల కవసరమైన వస్తు సముదాయమును విధించుచున్నాడు. యుగ యుగము నుండియు ఏకోవశుడై యున్నాడు. " ఎవనిస్తుతించుట యందు శతి, స్మృతి, దర్శనముఅవసన్న మయినవో అతని అపారమహిమావర్ణన నెవ్వరు చేయగలరు? ఏయోగి ఈతని తత్వమును ఏక్షణమందు దర్శింపగలుగునో-తనలో తాను నివసించుచు మన 'యెల్లర హృదయములలో నివసించు చున్నాడనియు, తనలో తాను నివసించుచు అందరి బాహ్యమునను నివసించుచున్నాడనియు, తనలో తాను నివసించుచు తనమంగళ యిచ్ఛ నిత్యము నెఱుంగుచున్నాడనియు, — అతడే నిజమైన యోగి యని ఈశ్వర ప్రసాదము వల్లనాకు విశ్వాసము జనించెను. అతని ప్రేమను పొంది అట్టివాడు తన ప్రాణము, మనస్సు, ప్రీతి, భక్తి, సర్వము నాతని కర్పించి అపరాజిత చిత్తములో ఆయన శాసనములను వహించుచు నాయన ప్రియ కార్యసాధన చేయుచుండును. ఆకడే బ్రహ్మోపాసకులలో శ్రేష్ఠుడు.