పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

ముహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,


ఎవడు మన ఆత్మ కధినాధుడో, సర్వదా మన ఆత్మలో జ్ఞానధర్మములను ప్రేరేపించు చుండునో అతడే “ సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ”. అతనిని మనయాత్మలో కనుగొందుము. అసీమ ఆకాశజ్ఞత జగత్తు యొక్క శోభాసౌందర్యముల మధ్య సత్య జ్ఞాన మనంతం బ్రహ్మ ” ను సందర్శించితిమేని అతడు ఆనంద రూపమునను అమృతప్రకాశము పొందుచున్నాడని కనుగొందుము.* సబాహ్యాభ్యంతరోహ్యజు! ". ఆజన్మ విహీన మైన పరమాత్మ బ్రాహ్మము నందును ఉన్నాడు, అంతరమునంచును ఉన్నాడు. మరియు నతడు“ అనంతర మవాహ్యం ”,నిత్యమే వాత్మసంస్తం.అతడు అంతరము నందును బాహ్యమునందును ఉండు టేగాక తనయందు తానై నివసించు చున్నాడు. అతని మంగళేచ్ఛను సర్వదాఎఱిగియున్నాడు. జ్ఞానమునందును, ప్రేమమంగళములందును అందరును ఔన్నత్యము చెందుదురు గాక. ఆయన " శాంతం, శివం, అద్వైతం.


ఈశ్వరాన్వేషకులు బ్రహ్మను మూడు స్థలములందు తెలిసికొన వలయును. అంతరంగ మందును, బాహ్యమందును, అతడు స్వయంభూతు డైయుండు ఆ బ్రహ్మస్థానము నందును. అతనిని అంతరమునందు సందర్శించినప్పుడు,"నీవు అంతరతర అంతరతముడవు. నీవునాబంధువు. నీవు నాసఖుడవు " అందుము. అతనిని మన బాహ్యమున దర్శించినప్పుడు,ఆ అసీమ ఆకాశము నందే నీరాజసింహాసనము,"అందుము. అతనిలోనే అతనిని మనము గాంచినప్పుడు, తన స్వీయధామమునందే పరమసత్యమును గాంచినప్పుడు, “ నీవు శివం, అద్వైతం; నీవు శాంత భావముతో నీమంగళయిచ్ఛ నిత్యము నెఱుంగుచున్నాడవు " అందుము అతనిని మన బాహ్య"