పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


నియమించిరి. దండు బయలుదేరుటకు సిద్ధముగ నుండెను. 'బుధుఁ'డను దేవునియొక్క ప్రతిమలన్నియు తునకలు చేయఁబడి యుండెను. ప్రజలందఱు ఖిన్నులైరి. ఈ దౌర్జన్యమును 'ఆల్సిబియాడీసు' చేసెనని యతని శత్రువు లపవాదవేసిరి. యుద్ధమునకుఁ బోవు సమయము గనుక వా రప్పుడతనిని విమర్శింపక దండుతోఁ బోనిచ్చిరి. ఈ యపవాదను పోగొట్టవలసిన దని వారి నతఁడు ప్రార్థించెను గాని వా రందుకు సమ్మతించలేదు. నావలతోఁగూడ నతఁడు బయలుదేరి సిసిలీద్వీపమునకుఁ. బోయెను.

ఈలోపున ప్రజ లీ యపవాదమును బరిశీలించి బంధుమిత్రవర్గంబులనుబట్టి కట్టి శిక్షించిరి. అతనిమీఁద వారు నేర స్థాపన చేసిరి. అతనిని పట్టి శిక్షించక డండుతో పోనిచ్చి నందుకు వారు వగచుకొనిరి. సేనను విడిచి వెంటనే రావలసిన దని వారతనికి వర్తమానముఁ బంపిరి. సిసిలీద్వీపములో యుద్ధము సాంతము కాలేదు. సేనలను విడిచి యతఁడు బయలుదేరెను. అతఁడు విగ్రహములను ధ్వంసము చేయుటయేకాక పురోహితుల వేషమువేసికొని వారిని వ్యధికరణము చేసెననియు నిందారోపణం జేసిరి. అతనిని చండాలునిగఁ బ్రకటనచేసి యతని యాస్తిని జప్తుచేసి రాష్ట్రమునకుఁ గలిపి ప్రజ లతనికి మరణదండన విధించిరి. ఈ సంగతుల నతఁడు విని స్వగ్రామమునకు వెళ్లక 'స్పార్టా' యను పరరాజ్యములోని పట్టణము