పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆల్సిబియాడీసు

53


ధారణాశక్తిఁ గలిగి వాచాలత్వమున నతఁడు ప్రజలను బరవశలుగఁ జేయుచుండెను. అతని దుర్వ్యాపారములను మాత్రము వారు సహింపలేదు. మద్యపానముఁజేసి పరస్త్రీల రతిలోఁబడి మునుఁగుచుఁ దేలుచు నతఁడు కొంతకాలము వ్యర్థము చేసెను. వేషభాషలలోఁగూడ నతఁడు శృంగారపురుషునివలె సంచరించెను. ఇట్టి పురుషునివైఖరి ప్రజారాజ్యములోని ప్రజల కంతగ నిష్టము లేకపోయినను నతనిని వారు మన్నించు చుండిరి. 'ధనమూల మిదం జగత్త'ను న్యాయము సుప్రసిద్ధ మయ్యెను.

భోజనకాలమున నతని గృహములో వీరభద్రపళ్లెరములను వాడుకొనుట కలదు. సహ పంక్తిని నెప్పుడుఁ బదుగురికు తక్కువలేక యతనితో స్నేహితులు భోజనము చేయుచుండిరి. అతిధి యభ్యాగతుల నతఁ డెన్నఁడును పొమ్మని చెప్పలేదు. ఇట్టి సుగుణ దుర్గుణ సంవర్గము గలవాఁడగుట నతనిని ప్రజలు ప్రేమించి యతని దుర్గుణములను బాలచేష్టలని భావించి సహించిరి.

'పెరికిలీసు' కాలధర్మమునొందినందున 'ఆథెన్సు' పట్టణములో వ్యవహారములను నడుపుటకు సమర్థుఁడు లేక పోయెను. అథీనియనులు సిసిలీద్వీపముపైకి దండెత్తిపోవలెనని సమకట్టిరి. 'ఆల్సిబియాడీసు' వారిని ప్రోత్సాహపఱచెను. వా రందుకు సమ్మతించి 'నిసియసు'ను నితనిని నౌకానాయకులుగ