పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జూలియసు సీజేరు

41


శయనించుచుండెను. పగటివేళల దుర్గములను పట్టణములను శిబిరముల నతఁడు పరీక్షించుచు హర్కారాలు సరిగ నారి పనిని చేయుచున్నదియు లేనిదియుఁ జూచుచుండెను. అతఁడు నడుచుచున్నపుడు తాకీదులను వ్రాయుట కొకలేకరియు నంగరక్షకుఁ డొకఁడును నతని వెంబడి పోవుచుందురు.

అతనికి బాగుగ స్వారిచేయు శక్తికలదు. గుఱ్ఱము పరుగిడుచున్నపు డతఁడు కళ్లెములను వదలి, చేతులు ముడుచుకొని కూర్చుండును, స్వారి చేయునపు డతఁ డిరువురు లేకరులు వ్రాయఁదగిన యంశములను వారికిఁ జెప్పుచుండెను. పని మిక్కుటమగుటచేత ముఖస్థముగ ప్రసంగించుట కవకాశము లేనందున స్నేహితుల కతఁ డుత్తరములమూలమున ప్రశంసాంశములను వ్రాసి పంపును.

క్రమముగ ఫ్రాడ్వివాకుఁడుగను (Proctor) యక్షదర్శకుఁడుగను (Consul) రాజకార్యములలో నతఁడు మెసలెను. ప్రభు మంత్రోత్సాహ శక్తులుకలిగి, శత్రువుల కలంఘనీయుఁడై వారి నతఁడు భంగపఱచెను. దైవముకూడ నతని కనుకూలుఁడయ్యెను. 'శిశిరో' దుర్మరణము నొందెను. 'పాంపేయి' యుద్దములోఁ బరాభవమునొంది జీర్ణించెను. క్రీ. పూ. 45 సం!!రము అంతమగు సరికి మార్గము నిష్కళంకమైనందున, రాజ్యంగముల నన్నిటిని స్వాధీనము చేసికొని ప్రజారంజకుఁడై యతఁడు కాలోచితముగ రాజ్యతంత్రములలో మార్పులను