పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


యా' దేశములో వికర్మకుఁడుగ నియోగింపఁబడి, యచటి పనుల బాగుగ నిర్వర్తించెను. క్రీ. పూ. 67 సం॥రమున సర్వాధికారియను పేరున నతఁడు కార్యములను వ్యవహరించుచుండెను. ఇంతలో ముఖ్యపురోహితుఁడు కాలము చేసి సందున, సీౙ రాపనిలోఁ బ్రవేశించెను. అతఁడు పురోహితుఁ డగుటవలన ప్రజలను దుర్వ్యాపారములలో నడువనీయఁ డని వారు భయ సంభ్రమములఁ జోందిరి. ఇతని సమకాలికులలో ముఖ్యులు 'పాంపేయి' 'శిశిరో' యనువారు. ఇతఁడు మహాయోధ. ఆనేక యుధ్ధములను చేసి జయముఁ బొందెను. ఫ్రెంచి, జెర్మను, స్పానియా, ఇంగ్లాండు, ఉత్తరాఫ్రికా దేశములను ధ్వంసము చేసి, వానినుండి కప్పముల నతఁడు పుచ్చుకొనుచుండెను. కొల్లపెట్టిన ధనము నతఁడు కొనక దానిని నిలవచేసి శూరులకు బహుమానముగ నిచ్చుచుండెను.

ఉచ్చపదవాంఛాందోళిత మానసుఁడై , రాత్రింబవళ్లు పాటుపడి, పిపాసాది బాధల కోర్చి సున్నితమైన శరీరము కలవాఁడై, యతఁడు శ్రమపడెను. సాధారణముగ తలనొప్పిచేత నతఁడు బాధపడుచుండెను. అప్పుడప్పుడతనికి మూర్ఛవచ్చుటకూడఁ గలదు. ఇట్టి సంకటము లతనిని వ్యసన పెట్టుచున్నను, దుర్వ్యాపారములులేక యుక్తాహారవిహారములలో నతఁడు కాలముఁ గడిపెను. అన్ని కాలములలోను యుద్ధమునకు వెళ్లినపుడు పల్లకిలోగాని రథముపైనిగాని యతఁడు