పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి సాధారణ రాజ్యాంగస్థితి

అని పిలువబడెను. * "తనయాజ్ఞ నెవరును మీరగూడదని విష్ణువు శాసించి తాను స్వయముగానే రాజుశరీరమును జొచ్చెను. ++ కావుననే ప్రపంచమంతయు దేవునకువలె రాజునకును మ్రొక్కెదరు. రాజగువాడు విష్ణూవంశముతోను దండనీతి యొక్క జ్ఞానము తోను పుట్టును." పురాతన హిందూదేశపు జిజ్ఞాసువులు రాజుయొక్క నిరంకుశాధికారము నీవిధముగా సమర్ధించిరి. రాజువిష్ణ్వంశ సంభూతుడయినను, ఈశ్వరదత్తమగు దండనీతి ననుసరించి న్యాయముగా ప్రజను పాలించుట అతనివిధి యనియు వారు నమ్ముచుండిరి. ఆకాలమున బ్రాహ్మణులు సాధారణశిక్షలనుండి తప్పించుకొనయత్నించిరి. కనుకనె స్మృత్యాదులందు బ్రాహ్మణుల దండించు విషయమున ప్రత్యేక నియమములు కలవు. ఈప్రకారము రాజులు, ప్రజనురంజింపజేయవలయునను తమకర్తవ్యములను నిర్లక్ష్యముచేసి క్రమక్రమముగా నిరంకుశులైరి.

     రాజుయొక్క నిరంకుశాధికారము సత్పరిపాలనానిర్భంధము తోగూడియుండెనని వెనుక జెప్పియుంటిమి. తాయభీప్రాయమే మహాభారేతమునందు వేరొక యధ్యాయమున మరియొకవిధముగా సూచింపబడియున్నది. రాజునకును ప్రజలకును జరిగిన ఒడంబడికను బట్టి వారికిట్టి సంబంధమేర్పడినదని ఈయధ్యాయ

  • రంజితాశ్చప్రజా: సర్వాస్తేన రాజేత శబ్ద్యతే॥శాంతి॥

++స్థానసంచాకరొద్విష్ణు, స్వయమేవ్నవాతేన॥ । నాతివర్తివ్యతేకశ్చి, ద్రాశంస్త్వామితిభారత:తపసాభగవాన్విష్ణు. రావివేశచభూమిపకిశాతికి