పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

వు నిర్దారనచేసెను. ఈ యంశము నింతనిర్లక్ష్యముగా తీర్మానించి నందున చేదిరాజు అధోగతిపాలై పాతాళమునకు బోయెను" కాని యీవివాద మింతటితో ముగియలేదు. జనసామాన్యము జంతువులకు మాఱుగా నిశరపదార్ధములను యజ్ఞసమయములం దర్పించి తృప్తినొందుచుండిరి. కాని క్షత్రియులు మాత్రము తమ పూర్వపద్ధతిని మానలేదు. కనుకనే క్షత్రియుడైనవాడు తన సర్ఫభౌమత్వమును జాటగలిగినపుడేల్ల ధర్మజ జనమేజయులవలె నశ్వమేధము జెయుచునే యుండెను. అశోకునివంసమంతరించిన తరువాత హిందూచక్రవర్తియగు పుష్యమిత్రుడు అశ్వమేధయాగము చేసెను. ఈవిధముగా యజ్ఞములుందు జరగుహింస న్యాయమైన దేనని బ్రాహ్మణ లొప్పుకొనవలసినదవరైరి. దీని తరువాత యధ్యాయమున అగస్త్యుని యజ్ఞపుకధకలదు. ఈజన్మము పెండ్రెండు వత్సరములు జగుచుండెను. దీనియందు నిర్జీవపదార్ధములే యాహుతి యియ్యబడెను. అంతనింద్రు డాగ్రహించి వర్షింపమానుకొనెను. యజ్ఞాదులకు ధాన్యమైనను దొరకదేమో కదా యని ఋష్యాదులు భయపడి, అగస్త్యుని యెద్దకు బోయి మొఱపెట్టుకొనిరి. అగస్త్యుడు చేయునదేమియులేక, ధాన్యమే లభింపనియెడల తాను మానసిక యజ్ఞముచేసెదననియు, కాకపోయినచో ఉత్తర కురుభూములకు బోయి ద్రవ్యము దెత్తుననియ్, అదియును కాదా తానె యింద్రత్వమువహించి భూమిని సస్యవంతముగ జేసెదననిచెప్పి యట్లె తన మహాత్మ్యమువలన ద్రవ్యము నుద్భవింప జేసెను. ఇంద్రుడచ్చెరువొంది తన్ను క్షమింపుమని యగ