పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చితిని. సాక్షులను విచారణచేయుటలో ప్రశ్నలు, అడ్డుసవాళ్ళు మొదలగునవి అప్పటికి నేర్చినరీతిని వేసి, చివర ప్రాసిక్యూషన్ తరపున గవర్నమెంటువకీలు వాదన ముగించిన పిదప, నేను వారికి ప్రత్యుత్తరమిచ్చుచు, ముద్దాయి నేరస్తుదు కాడనియు, నేరము రుజువుచేయుటకు విచారించినసాక్షులు విశ్వాసపాత్రులు గారనియు, సందర్భములుగూడ ముద్దాయి నిరపరాధియైనట్లే నిరూపించుచున్నవనియు చెప్పి ముగించితిని. ఆరోజులలో ఆకోర్టులో ప్రముఖుడగు న్యాయవాదిగానున్న శ్రీ వావిలాల శివావధానులు బి,ఎ.బి.యల్. ఆ కేసులో వారి కేమియుసంబంధము లేకపోయినను, కోర్టులోనుండి నేను చెప్పినదంతయు విని నేను (Pedantic) వాగాడంబరము చూపుటచే కాబోలు కన్నులు చేతితో మూసుకొనుచుండిరి. కోర్టులలో వ్యవహారోచితమైన భాషయే యుచితముకాని, నాకు కోర్టులో బాషించుట కొత్త యగుటచేత, కొన్ని యూతపదములు కొత్తకొత్తవి పెద్ద పెద్దవి పడినవి. న్యాయమూర్తి నేను కొత్తవాడనని గ్రహించి శాంతముగా నేను చెప్పినదంతయు వినెను. న్యాయమూర్తి అసెసర్లకు చెప్పుటలో సాక్షులు విశ్వాసపాత్రులుకారని వివరించి అభిప్రాయమును అడుగగా ముద్దాయి నిర్దోషియని చెప్పిరి. న్యాయమూర్తియు సమ్మతించి, ముద్దాయిని విడుదలచేసిరి. ఇట్లు ఒక ఖూనీకేసులో మేము జయముగాంచుటచేత, న్యాయవాదులు కొందరు మమ్ములను ప్రశంసించుటచేత, కొంతవరకు మంచి అవకాశము కలిగెను. ఆకేసు నడిపించుటలో, పట్టిన కేసు గెలుచు టెట్లు అనే యోచన ప్రధానముగా నుండెనేకాని సత్య మెట్లున్నదను విషయము మా కంతగా పట్టలేదని చెప్పుట