పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(

చిలకసముద్రం' కలెక్టరు

9

తాము ఒక జిల్లాకు కలెక్టరుగా పనిచేసినాననిన్నీ వారికింద తాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి నమ్మకంగా పనిచేసినప్పటికీ తన పెద్దతనంలో తనకు ఏమీ యివ్వకుండా తినడానికి కూడు, కట్టుకోవడానికి బట్టకూడా లేకుండా వీధులలో ముష్టియెత్తుకొని బ్రతకమని వదిలి వేశారనిన్నీ తన కధ చిత్రవిచిత్రముగా వర్ణిస్తూ అతి దీనంగా చెప్పుకోసాగినాడు.

ఇప్పటివలెనే ఆ రోజులలోకూడా లీడెన్ హాలు వీధి లండనులో వచ్చిపోయేవారితో నిండి కిటకిటలాడే రాజవీధి. తూర్పుదేశపు సంపదలకును ఇంగ్లాండుకును గల పరస్పరసంబంధానికి బాహ్యచిహ్నంగా ఆ వీధిలో కంపెనీ వారి దివ్యభవనం అందరికీ కనబడుతూ వుండేది. ఇండియాదేశంలో సంపదలార్జించి వచ్చిన దొరలను 'నవాబు ' లని చెప్పుకునేవారు వీళ్లు లెక్క లేనంత ధనమార్జించి ఆ ధన కనక వస్తువాహానాలలో దొర్లుతూ ఒళ్ళుపైని తెలియక సౌఖ్యాలు అనుభవిస్తూ నీతినియమాలు లేక కళ్లు నెత్తినిపెట్టుకొని వ్రవర్తించడాన్ని గురించి ప్రజలు ప్రత్యక్షంగా చూస్తూ కధలలో వింటూ నాటకాలలో దర్శిస్తూవుండేవారు. ఇట్టి స్థితిలో ఆ ఇండియాలోనే పనిచేసివచ్చిన నిర్భాగ్యుడైన ఈ ఉద్యోగి ఈ వీధులలోనే ఇలాగ పాకీపనిచేస్తూవుండడం చూసి అనేకమంది ఇది ఏమిటని ఆలోచించడం ప్రారంభించారు. లండన్ నగరంలో గొప్పవారు నివసించే పడమటిభాగంలో దీనిని గురించిన గుసగుసలు బయలుదేరినవి. స్నాడ్ గ్రాసుకూడా తాను వేసిన వేషానికి అనుగుణ్యంగానే ప్రవర్తించేవాడు. పాపం, అన్యాయం జరిగిన కంపెనీ ఉద్యోగి అనిచెప్పి ఎవరైనా పెన్నీలు (సీమదేశపు నాణెం - నాలుగుడబ్బులు) యిస్తే కృతజ్ఞతతో పుచ్చుకొని జేబులో వేసుకొనేవాడు.

ఇత డీ కంపెనీ భవనం ఎదుట ఇలా వుండడం చూసేటప్పటికి కంపెనీ డైరెక్టర్లకు తలవంపుగా తోచింది. అందులో ముఖ్యంగా ఇతడు చీపురు పెట్టి వూడ్చే పెద్దమెట్లపైని వున్న పెద్ద సింహద్వారం దగ్గరనే ఈడైరక్టర్లు తను గుఱ్ఱపు సార్టు బండ్లలో దిగి లోపలికి వెళ్లవలసి వచ్చేది. ఈదివ్య భవనానికి వెనక ఒక చిన్న సందులోనుంచి