పుట:Kasiyatracharitr020670mbp.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అడివి, కొండలు, పులులు, రాళ్ళు, దొంగలు వీండ్ల భయము చాలా కలిగివున్నది. యీ దినము నడిచినదారి యెడారి. కొంతమేర అడుసు నీళ్ళుగా వున్నది. నాగలాపల్లెవూరి ముందర వొక వుప్పు కాలువ వున్నది. దానికి పాటు పోటు కద్దు. పోటువేళ దానికి సంగడి అని రెండు తాటిచెట్లును దోనువలెనే తొలిచి చేర్చి కట్టివుంటారు. అందులో ఆరుగురు యెక్కవచ్చును.

నాగలాపల్లె అనేవూరు పెద్దది కాక పోయినా అన్ని పదార్ధములు దొరుకును. యిక్కడి వుప్పుకాలువ వద్ద చెన్నపట్టణములో వుండే వొక పెద్దమనిషే యీ దేశస్థుడి బోధన మీద్ పదివేల రూపాయలు ఖర్చుపెట్టి రెండుతాటాకు గుడిశలు వేసి రెండునీలిమందుచేసే తొట్లుకట్టి వొకబావి తొవ్వించినాడు. నీలిమందు లాభముయొక్క భ్రాంతి చెన్నపట్టణపు వారిని బహుశా యీరీతుగా ముంచినది. యీ వూరికి యానాం నీలపల్లి అనే గొప్ప బస్తీలు మూడు ఆమడలోవున్నవి. యింజరమనే గ్రామము నీలపల్లికి సమీపముగా వున్నది. మాదయాపాళెము యానానికి ఆమడదూరములో నున్నది. యీవూరికి కాకినా డనే కలకటరు నివాసస్థలము 7 కోసుల దూరములో వున్నది.

వుప్పాడా అనేవూరు యిక్కడికి కోసేడుదూరములో నున్నది. వుప్పాడాకు చుట్టూ ఆమడదూరములో సముద్రతీరమందు సుమారు యేనూరు యిండ్ల బోయిజాతివారు గుడిసెలు వేసుకొని కాపురమున్నారు. వీరికి పయిరు భూమి యిలాకా యెంతమాత్రములేదు. సముద్రములో మత్స్యములి పట్టి యెండవేశి మణుగు 1 కి కొంగము తీరువ యిచ్చి అమ్ముకోవడమున్ను చెన్నపట్టణములో కొలువుకొలిచి బ్రతకడమున్ను. వీరియిండ్లలో మొగవాడు పుట్టితే చచ్చేవరకు తల 1 కి ర్పూ 14 సరకారువారికి తీరువ యివ్వవలసినది. వీరి గుడిశలు నాలుగు రూపాయలకు యెక్కువచేయవు. యీబోయస్త్రీలు కట్టెలుకొట్టి అమ్మడమువల్లనున్ను, పైరుపెట్టే సంసారులకింద పనిపాటులు చేయడామువల్లనున్ను, వన్యములైన కూరకాయలు తెచ్చి అమ్మడమువల్లనున్ను కాలక్షేపముచెయుచు మొగవాండ్ల నిమిత్తము సరకారుకు యివ్వవలసిన పన్నుసహా యిచ్చుకుంటారు. మొగవాండ్లు రూపాయి 1 కి నెలంతా