పుట:Kasiyatracharitr020670mbp.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేమంటే నిర్గుణ బ్రహ్మము సృష్టి సంకల్పము కాకమునుపు జ్యోతిర్మయకారముగా యీ స్థలములొ మిక్కిలి జ్వలిస్తూ వున్నట్టున్ను బ్రహ్మకు, విష్ణువుకున్ను అహంపూర్వ మహంపూర్వ మని వివాదము పొసగినట్టున్ను జ్యోతిర్మయాన్ని చూచి ఆ యుభయులున్ను పరమయిన వస్తువు యీజ్యోతిస్సని తెలుసుకొని తాము శాంతిపడ్డట్టున్ను, సాంబమూర్తి ఈ స్థలము అనుపూర్విక మయినందున యిక్కడ వసించసాగినట్టున్ను, తద్ద్వారా మహాశ్శశాన మయినదనిన్ని ఆ జ్యోతిర్లింగము యిప్పటికిన్ని యిక్కడ పంచకోశాత్మకముగా యున్న దనిన్ని అదిని యీ భూమి జ్యోతిర్భూతానికి వాసయోగ్యమయినందున బ్రహ్మాదులు యిక్కడ తపస్సుచేసి సకల సిద్ధులు పొందినారనిన్ని, అగస్త్యాది ఋషులు అదేప్రకారము యుక్కడ తపస్సు చేసి సచ్చిదానందమును అనుభవించినందున యీ స్థలము ఆనందవనమనే పేరు వహించినదనిన్ని, మహాప్రళయాదులలో జ్యోతిర్భూతానికి యీ భూమి వాసయోగ్యమైనందున త్రిగుణాత్మకమయిన మూడు ముండ్లవంటి కొనలు కల ఆయుధముతో యీ భూమి యెత్తబడి వుండినందున త్రికంటక విరాజితమనే బిరుదు యీస్థళానికి కలిగినదనిన్ని, మిక్కిలి ముఖ్యముగా చెప్పి అటుతర్వాత పరాపరఫస్తువు సర్వాంతత్యామి గనుక యెవరియందు ఆ వస్తువును ఆరొపితము ఛేసినా ఛేయవచ్చును గనుక స్కాందపురాణ కారకుని ఇష్టప్రకారము అపరాపర వస్తువునే శివుడని సిద్ధాంతపరచబడిన ఆ సాంబమూర్తి తద్ద్వత్తుగా జ్యోతిర్మయముగా ప్రకాశించి నాడనిన్ని, ఆయన కటాక్షము సంపాదించి బ్రహ్మాదులు వారివారి అధికారాలు పుచ్చుకున్నారనిన్ని విస్తరించి యున్నది.

యింతటికి యిక్కడి యీశ్వరుని పేరు విశ్వేశ్వరుడు. ఇది సమష్టివాచకము. లింగమున్ను సమష్టిరూపమేగాని పార్వతిసహితముగా వృషభారూఢుడయిన సాంబమూర్తి రూపముకాదు; లక్ష్మిని వక్షస్థలమందు వహించిన మహావిష్ణు రూపమున్ను కాదు; అయితే శైవులు ఆ లింగారాధనను చేయుచు వచ్చుచున్నారు. అందువల్ల వైష్ణవులు ఆ రూపము యొక్క ఆరాధనను వదిలినారు. యీస్థలములో జ్యోతిర్భూతమ్మ