పుట:Jyothishya shastramu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1.జ్యోతిష్యము అంటే ఏమిటి?

జ్యోతిష్యము అను పదమును విడదీసి చూచితే ‘జ్యోతి’ మరియు ‘ఇష్యము’ అను రెండు శబ్దములు కలవు. ఆ రెండు శబ్దములను కలిపితే జ్యోతి+ఇష్యము=జ్యోతిష్యము అను శబ్దము ఏర్పడుచున్నది. జ్యోతిష్యము లోని మొదటి శబ్దమును పరిశీలించి చూచితే ‘జ్యోతి’ అనగా వెలుగుచున్న దీపము అని అర్థము. వెలుగుచున్న దీపము కాంతి కల్గియుండునని అందరికీ తెలుసు. చీకటి గృహములో దీపము లేకపోతే ఇంటిలోని వస్తువు ఒక్కటి కూడా కనిపించదు. ఇంటిలోని వస్తువులు ఎన్ని ఉన్నవీ? ఏమి వస్తువులు ఉన్నవీ? ఆ వస్తువులు ఖరీదైనవా? కాదా? వస్తువులు నగలైతే ఏ లోహముతో చేసినవి? కట్టెలైతే ఏ జాతి చెట్టు కట్టెలు? పాత్రలైతే మట్టివా? ఇత్తడివా? గుడ్డలైతే నూలువా? పట్టువా? కాయలు అయితే ఏ జాతి చెట్టు కాయలు? మొదలగు విషయములను దీపకాంతితోనే తెలుసుకోగలము. ఆ విధముగ చీకటిలో ఉపయోగపడునది దీపము. వివిధ రకముల వస్తువుల వివరమును తెలుసుకోవడమును ‘ఇష్యము’ అంటున్నాము. దీపము వలన వస్తువుల వివరము తెలియబడడమును ‘జ్యోతిష్యము’ అంటాము. ఉదాహరణకు ఒకడు చీకటితో నిండిన తన ఇంటిలో ఏమున్నది తెలియకున్నపుడు, తనవద్ద దీపము లేకపోయినా, లేక తాను గ్రుడ్డివాడైనా, మరొకని సహాయమడిగి అతని వలన తెలుసుకోవడము జరుగుచున్నది. ఎదుటివాడు మన ఇంటిలో వస్తువుల వివరము మనకు తెలుపాలంటే, అతను కూడా తన దీపమును ఉపయోగించి చూడవలసిందే అట్లు చెప్పడమును ‘జ్యోతిష్యము’ అంటున్నాము.

ఇక్కడ కొందరు భాషా పండితులు ఒక ప్రశ్న అడుగవచ్చును. ‘జ్యోతి’ అనగా దీపము అని అర్థము కలదు. కానీ ‘ఇష్యము’ అనగా తెలుసుకోవడము అని అర్థము ఎక్కడా లేదే అని అడుగవచ్చును. దానికి