పుట:Jyothishya shastramu.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలసియుండును. స్థానబలమును గ్రహబలమును రెండిటిని సమన్వయ పరచుకొని చూచినప్పుడు సరియైన ఫలితమును తీసి చెప్పగలము. ఇప్పుడు అడిగిన విషయము సంతతికి సంబంధించినది, కావున సంతతి యొక్క విషయము కర్మచక్రములో ఏ స్థానములో ఉండునని చూచిన అది ఐదవ స్థానమని తెలియుచున్నది. ఐదవ స్థానములో పుణ్యము ఉంటుంది. ఆ పుణ్యములో ప్రపంచజ్ఞానము, విషయగ్రాహితశక్తి, సంతతి మొదలగు విషయములన్ని రాశులుగా (కుప్పలుగా)యుండును. అందువలన ఐదవ స్థానములో సంతతికి సంబంధించిన విషయమును చూడవలసియుండును. ఒకటి స్థానమునుబట్టి, రెండు గ్రహమునుబట్టి చూడవలెను. సంతానము నకు సంబంధించిన గ్రహములు రెండు గలవు. అందులో ఒకటి చంద్రుడు, రెండవది గురువు. కొడుకులను గురించి చూడవలసివచ్చినప్పుడు గురువును చూచి చెప్పాలి. కేవలము సంతతిని గురించి అడుగునప్పుడు చంద్రున్ని చూచి చెప్పాలి. ఐదవ స్థానములో అశుభగ్రహములున్నా, సంతాన కారకులైన చంద్రుడు అశుభస్థానములోయున్నా అశుభగ్రహములచే కలిసి యున్నా వారి సంతానమును అశుభగ్రహములు లాగుకొని సంతానము లేకుండ చేయుదురు. గురువుకానీ, చంద్రుడుగానీ మంచిస్థానములోయున్నా ఐదవస్థానములో శత్రుగ్రహములు లేకుండా శుభగ్రహముండిన, వారికి తప్పక సంతానము తొందరలో కల్గునని తెలియుచున్నది.

33) ఇప్పుడు ప్రపంచములోనే ఇస్లామ్‌ సమాజమునకు పూజ్య భావము, గౌరవ భావము కల్గియున్న ముహమ్మద్‌ ప్రవక్తగారి జాతకమును ఇస్తాము. ఆ జాతకములో విశేషత ఏమి ఉన్నదో తెలుపగలరా?