పుట:Jyothishya shastramu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలియును. అందువలన ప్రమాదములను ఒక సంవత్సరములో గుర్తించు కోవచ్చునుగానీ, అంతకంటే ముందు తెలుసుకొనుటకు వీలుపడదు.

నేను బ్రహ్మవిద్యకు సంబంధించినవాడిని, జ్యోతిష్యుడను కాను. అందువలన ప్రతి సంవత్సరము పంచాంగములను చూచే అలవాటు నాకు ఏమాత్రము లేదు. అందువలన 1991 సంవత్సర పంచాంగమును రాజీవ్‌గాంధీ చనిపోయిన తర్వాత చూచాను అందులోని లోపములను గ్రహించాము. ఒకవేళ ఆ సంవత్సరము ముందే తెలియవలసియున్న పంచాంగమును తీసుకొని ప్రతి నెల వెదుకుచువచ్చివుంటే లోపములు మే నెలలో ఉన్నట్లు కనిపించేవి. ఒక జాతకునికి అనేక విషయములలో అనేక కోణములనుండి చూడవలసియుంటుంది. ఇదంతా ఒక సంవత్సరము పాటుయున్న మంచి చెడు కాలమును వెదకడానికి సమయము ఓపిక యుండవలెను. అట్లు ఓపిక, సమయము ఉన్నవారు సంవత్సరము మొదలులోనే పంచాంగమును వెదకి తమతమ మంచి చెడులను గ్రహించుకోవచ్చును. ఒక ప్రమాదమును జాతకములో సూచించినా, ఆ ప్రమాదము ఏ సంవత్సరములో జరుగుననుటకు ప్రతి సంవత్సర పంచాంగమును చూడవలసియుండును. అందువలన జ్యోతిష్యుడు జాతకములోని సమస్యలను ప్రస్తుత వర్తమాన పంచాంగములలో వెదకవలసి వచ్చును. రాజీవ్‌గాంధీ గారికి ప్రమాదము పుట్టిన జాతకములోయుంటే, అది జరుగుటకు కావలసిన గ్రహబలము 1991వ సంవత్సర పంచాంగము లో ఉన్నట్లు పంచాంగమును వెదికియుంటే ముందే తెలిసేది. ఇప్పుడు జగన్‌ అను వ్యక్తి యొక్క జాతకములో రాజీవ్‌గాంధీకి జరిగిన ప్రమాదమునకు సరియగు ప్రమాదము ఉన్నట్లు సూచనలు కనిపించినా, అది ఎప్పుడు జరుగును అను సమాచారము జాతకములో ఉండదు. అందువలన ప్రతి