పుట:Jyothishya shastramu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థానములలోని కర్మను గ్రహించునట్లు చేతులు ఉండుట వలన మేషము నుండి ఐదవ లగ్నమైన సింహమునందునూ, ఏడవ స్థానమైన తులా లగ్నము నందునూ, తొమ్మిదవ లగ్నమైన ధనస్సుయందును గురు గ్రహము ఉన్నట్లే లెక్కించుకోవలెను. అట్లే శని గ్రహమునకు కూడా నాలుగు చేతులుకలవని చెప్పుకొన్నాము. ఒక చేతి చేత ప్రస్తుతమున్న కర్కాటక లగ్నములోని కర్మను గ్రహించగా, 3, 7, 10 స్థానములలోని కర్మను గ్రహించునట్లు మిగత మూడు చేతులు ఉండుట వలన శనివున్న లగ్నమునుండి మూడవ లగ్నమైన కన్యాలగ్నమందునూ, ఏడవ లగ్నమైన మకరమందునూ, పదవ లగ్నమైన మేషమందు గల కర్మను గ్రహించగలుగును. అందువలన కన్యా, మకరము, మేషములలో కూడా అన్ని గ్రహములున్నట్లే లెక్కించుకోవలెను. అలా గుర్తించుకుంటే జాతకలగ్నము ఎలాగుండునో ఒకమారు క్రిందగల 52వ చిత్రపటములో చూస్తాము.

52వ పటము.