పుట:Gutta.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24 గంటలలో ఒకటి లేక రెండు, రెండున్నర గంటలు నిదురించే వాడు. రెండున్నర గంటల నిద్ర నెలకొకమారు ఉండెడిదని, మిగత దినములలో తక్కువగా నిద్రించెడివాడని, కొన్ని దినములలో ఏమాత్రము నిద్రించేవాడు కాదని చెప్పవచ్చును. ఆయన శరీరములో ఇన్సులిన్‌ లోపము వలన సుగర్‌ లెవల్‌ మూడువందలకు పైన 350, 400 వరకు 18 సంవత్సరము లుగా ఉన్నది. అయినా ఆయన శరీరములో ఎటువంటి మార్పు రాలేదు. తాను ప్రయాణిస్తున్న కారు ఎన్నోమార్లు ఘోరప్రమాదానికి గురియైనా ఆయనకు ఎటువంటి హాని కలుగలేదు. ఇంత పెద్ద ప్రమాదములో మీరెలా బ్రతికారని ఇతరులు అడిగినప్పుడు నేను చేయవలసిన పనులు,వ్రాయవలసిన వ్రాతలు ఇంకా ఉన్నాయి అనెడివాడు.


ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పే బోధలను గ్రహించిన కొందరు జ్ఞానులు, ఈ జ్ఞానమును భూమిమీద ఏ మనుషులు చెప్పలేరని అనుకొని ఆయనను ప్రత్యక్షముగా చూచిన తర్వాత గొప్పభావము వారిలో లేకుండా పోయేది. కొందరు ఇదే విషయమునే ‘‘మిమ్ములను చూడక ముందువున్న భావము మిమ్ములను చూచిన తర్వాత ఎందుకు లేకుండా పోయింది’’ అని అడిగెడివారు. దానికి సమాదానముగా ‘‘దేనికైనా కాలము రావాలి, మనిషి దేనికీ బాధ్యుడు కాడు’’ అని అనెడివాడు. ఎప్పుడూ తనను గూర్చి గొప్పగా చెప్పుకోక తనను తాను తగ్గించుకొని నేను మీలాంటి మనిషినే నాకు ఎవరూ నమస్కరించవద్దండి. మీరు నేరుగా దేవున్నే మ్రొక్కండి అనెడివాడు. అలాంటి వాడు తనను గొప్పగ అనుకొనునట్లు ఇప్పుడు ఈ రచనలో వ్రాయడమేమిటని ఎవరికైన ప్రశ్న రాక తప్పదు. దానికి ప్రబోధానంద యోగీశ్వరులు ఏమి సమాదానము చెప్పక నాపైనున్న వానికి తెలుసు అన్నాడు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/40&oldid=279921" నుండి వెలికితీశారు